Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్‌స్కీ

ABP Desam Updated at: 18 May 2022 04:51 PM (IST)
Edited By: Murali Krishna

Cannes Film Festival: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దండయాత్రపై యావత్ సినీ ప్రపంచం ప్రశ్నించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్‌స్కీ

NEXT PREV

Cannes Film Festival:


ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం కేన్స్ వేడుకలు ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుక ప్రారంభోత్సవంలో లైవ్ శాటిలైట్ వీడియో ద్వారా ప్రత్యేక ప్రసంగం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. రష్యా చేస్తోన్న దురాగతాలను ప్రపంచానికి గొంతెత్తి చాటాలని ఆయన కోరారు. 







ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దారుణ మారణహోమంపై సినీ ప్రపంచం గొంతెత్తాలి. రష్యా చేస్తోన్న దాడుల్లో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణ హింసపై సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా? లేదా మాట్లాడుతుందా? ఓ నియంత యుద్ధం మొదలుపెడితే.. స్వేచ్ఛ కోసం ఓ పోరాటం జరుగుతుంటే ప్రపంచమంతా ఏకమవ్వాలి.  రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఛార్లీ చాప్లిన్‌ తీసిన 'ది గ్రేట్‌ డిక్టేటర్‌'.. ప్రస్తుత ఉక్రెయిన్‌ పరిస్థితులకు భిన్నంగా ఏం లేదు. చాప్లిన్‌ తీసిన డిక్టేటర్‌ నిజమైన నియంతను నాశనం చేయలేకపోవచ్చు. కానీ అలాంటి దారుణాల పట్ల సినీ ప్రపంచం మౌనంగా ఉండదని మాత్రం ఆ చిత్రం చాటిచెప్పింది. ఇప్పుడు కూడా సినీ ప్రపంచం నిశ్శబ్దంగా ఉండబోదని రుజువు చేసేందుకు మనకు కొత్త చాప్లిన్‌ అవసరం.                                               - జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు


స్టాండింగ్ ఒవేషన్


ఈ ప్రసంగంలో భాగంగా 'ది గ్రేట్‌ డిక్టేటర్‌' చిత్రంలో చాప్లిన్‌ చెప్పిన ఓ డైలాగ్‌ను జెలెన్‌స్కీ ప్రస్తావించారు.



మనుషుల మధ్య ద్వేషం పోతుంది. నియంతలు మరణిస్తారు. ప్రజల నుంచి వారు బలవంతంగా తీసుకున్న అధికారం.. తిరిగి ప్రజలకు వస్తుంది.                                                 - జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు


ఆయన ప్రసంగానికి వేడుకకు హాజరైన వారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ వేడుకలో భాగంగా ఉక్రెయిన్‌ దర్శకుడు మాంటాస్‌ రూపొందించిన 'ది నేచురల్ హిస్టరీ ఆఫ్‌ డిస్ట్రక్షన్‌' డాక్యుమెంటరీని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ డాక్యుమెంటరీ తీసిన కొద్ది రోజులకే మాంటాస్‌.. మేరియుపోల్‌లో రష్యా జరిపిన దాడుల్లో మరణించారు.


Also Read: Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్


Also Read: Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!

Published at: 18 May 2022 04:49 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.