Wall Collapse in Gujarat: గుజరాత్ మోర్బి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. హల్వాద్లోని ఓ ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలింది. పక్కనే పని చేస్తున్న 30 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
గుజరాత్ మోర్బిలో గోడ కూలి జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతోంది. - ప్రధాని నరేంద్ర మోదీ
పరిహారం
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ప్రధాన మంత్రి కార్యాలయం. క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారంగా ఇస్తామని ట్వీట్ చేసింది.
Also Read: Karti Chidambaram: వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరం ఆడిటర్ అరెస్ట్
Also Read: Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్