Hardik Patel Resign: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ పీసీసీ చీఫ్‌గా ఉన్న యువనేత హార్థిక్ పటేల్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. ఆ లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు.






ఎన్నికలకు ముందు


గుజరాత్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో పాటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌గా మారింది.


2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు హార్దిక్. అయితే కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు. కానీ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను మాత్రం హార్థిక్ సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. కానీ పార్టీకి రాజీనామా చేసినట్లు బుధవారం ఆయనే స్వయంగా ప్రకటించారు.


హార్థిక్ పటేల్‌ను పార్టీలోనే ఉండాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా కోరినట్లు సమాచారం. అయినప్పటికీ హార్థిక్ రాజీనామాకే మొగ్గు చూపినట్లు ఆయన సన్నిహత వర్గాలు తెలిపాయి. అయితే హార్దిక్​ ఏ పార్టీలో చేరతారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. భాజపాలో చేరతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.


Also Read: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్



Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి