Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  ఈ కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరరివలన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 31 ఏళ్లుగా పెరరివలన్ జైలులోనే ఉన్నారు. 1991, జూన్ 11న పెరరి అరెస్ట్ అయ్యారు.









రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పదార్థాలు అందించినందుకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సుప్రం కోర్టు తీర్పు ఇచ్చింది.


మాజీ ప్రధాని హత్య


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991, మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య కేసులో దోషులుగా తేలిన పెరరివలన్‌తో పాటు మురుగన్‌, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది.


అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలని గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవల పెరరివలన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసుని విచారించిన ధర్మాసనం రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివలన్‌ను విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది.


చివరికి


ఈ కేసులో దోషిగా తేలిన పెరరివలన్ తన 19 ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యాడు. 31 ఏళ్లుగా పెరరివలన్ జైలు శిక్ష అనుభవించారు. అయితే ఆయన్ను రిలీజ్ చేయాలని తమిళనాడు సర్కార్ చేసిన సిఫార్సును గవర్నర్ అడ్డుకోవడం సబబు కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 142 అధికారాన్ని ఉపయోగించుకుని బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు.


Also Read: Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి