Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు నమోదయ్యాయి. 33 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15,647గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.42%గా ఉంది. తాజాగా 2,549 మంది రికవరయ్యారు.
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా కొత్తగా 14,97,695 మందికి పైగా టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 191 కోట్లు దాటింది. ఒక్కరోజే 4 లక్షల 34 వేల 962 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కీలక నిర్ణయం
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: National Survey: కొడుకు పుట్టాలని కోరుకునే జంటల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది, సర్వేలో తేలిన విషయం