Wagner Group Rebellion:
డీల్ కుదిరింది..
రష్యా అధ్యక్షుడు పుతిన్, వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతానికి చల్లారినట్టు కనిపిస్తున్నాయి. రెండు వర్గాల మధ్య చర్చలు జరిగిన తరవాత ప్రిగోజిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రెమ్లిన్ ప్రతినిధి ఈ డీల్‌కి సంబంధించి వివరాలు వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం...ప్రిగోజిన్ రోస్తోవ్ నుంచి వెళ్లిపోయేందుకు ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న బెలారస్‌కు వెళ్లిపోయాడు. ఇలా చేస్తే...ఆయనపై రష్యా మిలిటరీ పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకుంటామని డీల్ కుదుర్చుకున్నారు. అంతే కాదు. తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్‌లోని సైన్యంపైనా ఎలాంటి చర్యలు తీసుకోమని రష్యా హామీ ఇచ్చింది. ఇక ఇప్పటి వరకూ ఈ తిరుగుబాటులో పాల్గొనని సైన్యానికి కాంట్రాక్ట్ జాబ్‌లు ఇచ్చేందుకు రష్యా ఢిఫెన్స్ మినిస్ట్రీ ముందుకొచ్చింది. అంతర్యుద్ధం జరగకుండా చూడడమే పుతిన్ ఉద్దేశమని, అందుకే ఆ మేరకు వాగ్నర్ గ్రూప్‌తో చర్చలు జరిపి డీల్ సెట్ చేశారని రష్యా మిలిటరీ ప్రతినిధులు కొందరు వెల్లడించారు. అంతకు ముందు పుతిన్‌పై చాలా సీరియస్‌గా మాట్లాడిన ప్రిగోజిన్...ఆ తరవాత తన స్వరం మార్చాడు. "తిరుగుబాటుకి సిద్ధమైన సైనికులను వెనక్కి వచ్చేస్తున్నారు. అనవసరంగా అలజడి సృష్టించటం నాకు ఇష్టంలేదు" అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అప్పటికే అంతర్యుద్ధం సమసిపోయినట్టేనని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రిగోజిన్ బెలారస్‌కి వెళ్లిపోవడం వల్ల క్లారిటీ వచ్చేసింది. సెక్యూరిటీ గ్యారెంటీస్ ఇస్తే తమ తిరుగుబాటుని ఉపసంహరించుకుంటామని ప్రిగోజిన్ చెప్పగా..ఆ డిమాండ్‌లకు తగ్గట్టుగా డీల్ కుదిర్చారు. వాగ్నర్ గ్రూప్ రొస్తోవ్ నుంచి వెళ్లిపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. యుద్ధ ట్యాంకులతో పాటు ప్రిగోజిన్ వెళ్లిపోతుండగా రష్యన్స్ చప్పట్లు కొడుతూ వాళ్లకు గుడ్‌బై చెప్పారు. కొందరు "వాగ్నర్ వాగ్నర్" అంటూ నినాదాలు చేశారు.
ఇదీ జరిగింది..
వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తమపై తిరుగుబాటు చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. దేశ ద్రోహులను సహించేదే లేదని తేల్చి చెప్పారు. "ఇది వెన్నుపోటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు దేశ మిలిటరీపైనే దాడి చేయడం సరికాదని అన్నారు. అటు ఉక్రెయిన్ మాత్రం రష్యాలో అంతర్యుద్ధంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. పుతిన్‌కి ఇదే సరైన సమాధానం అని అంటోంది. "ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీకి సన్నిహుతుడైన ఓ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అటు రష్యా మిలిటరీ ఇప్పటికే వాగ్నర్ గ్రూప్‌పై ఉగ్రవాద ముద్ర వేసింది. యాంటీ టెర్రరిజం ఆపరేషన్ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ తిరుగుబాటు ఆపితే వాగ్నర్ సైనికుల సేఫ్‌టీకి హామీ ఇస్తామని రష్యా వెల్లడించింది. అటు వాగ్నర్ గ్రూప్ మాత్రం ముందు వెనక్కి తగ్గలేదు. ఆ మిలిటరీ చీఫ్ ప్రిగోజిన్ (Prigozhin) రోస్తోవ్ (Rostov)లోని రష్యా మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌ని అధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. రష్యా కేవలం ఉక్రెయిన్ మీద మాత్రమే దాడి చేసుకునేలా చూసుకుంటామని, తమపై దాడికి దిగితే ఊరుకోమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓ రష్యన్ మిలిటరీ హెలికాప్టర్‌పై దాడి చేసి నేల కూల్చామని చెప్పారు. వాగ్నర్ గ్రూప్‌లో దాదాపు 50 వేల మంది సైన్యం ఉన్నట్టు అంచనా. పోరాడి చనిపోయేందుకూ రెడీగా ఉన్నామన్న ప్రిగోజిన్...ఉన్నట్టుండి వెనక్కి తగ్గడం వల్ల పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
Also Read: Modi Egypt Visit: ఈజిప్టు చేరుకున్న మోదీ, 26 ఏళ్ల తర్వాత మొదటిసారి భారత ప్రధాని పర్యటన