Viral Video: 



బైడెన్ కన్‌ఫ్యూజన్..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పెద్ద పొరపాటు చేశారు. లిథుయానియాలో జరుగుతున్న నాటో సదస్సులో ప్రసంగిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రస్తావన తీసుకొచ్చారు. జెలెన్‌స్కీ బైడెన్ పక్కనే నిలబడి ఉన్నారు. అయితే...ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకొచ్చిన జో బైడెన్...జెలెన్‌స్కీ పేరుని పుతిన్‌ పేరుని కలిపేశారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. నిజానికి జెలెన్‌స్కీ పూర్తి పేరు వోలోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy). రష్యా అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin). ఈ పేరు విషయంలోనే బైడెన్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. వ్లాదిమిర్ పుతిన్‌లోని వ్లాదిమిర్‌ని జెలెన్‌స్కీ పేరుతో కలిపేశారు. వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అని పిలిచారు. "నేను వ్లాదిమిర్ మాట్లాడుకున్నాం" అని అన్న వెంటనే తన తప్పు తెలుసుకున్న బైడెన్ సరి చేసుకున్నారు. నిజానికి ఉక్రెయిన్‌లోని వోలోదిమిర్ అనే పేరుని తరచూ వాడతారు. కానీ...దాన్ని జెలెన్‌స్కీ పేరుకి జోడిస్తూ బైడెన్‌ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు బైడెన్‌పై సెటైర్లు వేస్తున్నారు. 






గతంలోనూ..


"అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ రిటైర్ అయిపోవడం మంచిది. ఇలాంటి కామెంట్స్ వినడం కన్నా దారుణం ఇంకేదీ ఉండదు. కేవలం పొలిటికల్ గెయిన్ కోసం ఆయన ప్రెసిడెంట్‌గా ఉంటున్నారంతే" అని ఓ నెటిజన్ మండి పడ్డాడు. "ఒబామా, ఒసామాను ఒకే విధంగా పలుకుతుంటారు కొందరు. ఇదే చిరాకు పుట్టిస్తుందనకుంటే ఇప్పుడు పుతిన్, జెలెన్‌స్కీ పేర్లనూ బైడెన్ ఇలా ప్రనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంది" అని కామెంట్ చేశాడు మరో నెటిజన్. గతంలోనూ ఓ సారి బైడెన్ ఉక్రెయిన్ ప్రజల గురించి ప్రస్తావిస్తూ ఉక్రేనియన్స్‌కి బదులుగా ఇరానియన్స్ అని అన్నారు. ఆ వీడియో కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇలా తరచూ నోరు జారి నవ్వుల పాలవుతున్నారు బైడెన్.


ఇటీవలే చైనాను పొగిడి విమర్శలు ఎదుర్కొన్న బైడెన్...ఇప్పుడు మరోసారి వింత వ్యాఖ్యలు చేశారు. పసిఫిక్ సముద్రం నుంచి హిందూమహాసముద్రం వరకూ రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వీడియో వైరల్ అవుతోంది. "మా ప్రభుత్వం పసిఫిక్ సముద్రం నుంచి హిందూమహా సముద్రం వరకూ రైల్వే మార్గాన్ని నిర్మించాలని చూస్తోంది" అని బైడెన్ చెప్పడంపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. అంతలోనే అప్రమత్తమై "స్క్రిప్ట్‌లో లేనిది మాట్లాడుతున్నానా" అని నవ్వుకున్నారు. ఇది విని హాల్‌లో ఉన్న వాళ్లంతా గట్టిగా నవ్వారు. 


"పసిఫిక్ మహా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకూ రైల్వే మార్గం నిర్మించాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంగోలాలో అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ కట్టాలనీ ఆలోచిస్తున్నాం. మేం ఇవన్నీ చేయొచ్చు. కానీ నాకెందుకో నేను దారి తప్పి మాట్లాడుతున్నాను అనిపిస్తోంది. బహుశా నేను చిక్కుల్లో ఇరుక్కుంటున్నానేమో"


- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు