Viral News: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్, పాటలు, స్టంట్లు, ఫ్రాంకింగ్ వీడియోలు వైరల్ అవుతూ జనాలను ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్లను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అయితే ఈ వీడియోలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కే పరిమితం కాకుండా అన్నింటిని టచ్ చేస్తుంటాయి. ఏదైనా గొడవ జరిగిన, క్రైమ్ జరిగినా, కొట్టుకున్నా, ఏదైనా దొంగ తనం చేస్తూ దొరికి పోయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని పని కొచ్చేవి కూడా ఉంటాయనడంలో సందేహం లేదు. ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో, నాలెడ్జ్ పంచే వీడియోలతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఇవేవీ కాకుండా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అవి నిజమేనా, వీడియో కనిపించేది రియల్ గా జరిగిందా, లేదా మన కళ్లు మోసం చేస్తున్నాయా, అక్కడ జరిగేది ఒకటైతే మరొకటి కనిపిస్తుందా, వారి ఉద్దేశం ఒకటైతే మరో యాంగిల్ లో ఆ వీడియో వైరల్ అవుతుందా అనేది తెలియకుండానే, తెలుసుకోకుండానే చాలా మంది స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో ఏదైనా వీడియో కనిపిస్తే చాలు.. విపరీతంగా రియాక్ట్ అవుతుంటారు. అలాంటి కొన్ని వీడియోల వల్ల విద్వేషాలు కూడా చెలరేగుతాయి. 






అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుంటారు. ఈ స్వల్ప నిడివి గల వీడియోను గోపాల్ గోస్వామి అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు. ఆయనకు ట్విట్టర్ లో 23.1K మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. గోపాల్ గోస్వామి పోస్టు చేసిన ఈ 17 సెకన్ల వీడియోకు గుప్త నవరాత్ర్ చల్ రహే హై, శ్రావణ్ మాస్ భీ సమీప్ హై, కాఫిర్ భాయియోం కే ఉపవాస్ కే లియే సేప్ పవిత్ర్ కర్తా ఏక్ మోమిన్(గుప్త నవరాత్రులు నడుస్తున్నాయి, శ్రావణ మాసం కూడా దగ్గరపడింది, సోదరుల ఉపవాసాల కోసం ఓ మోమిన్ ఆపిళ్లను పవిత్ర చేస్తున్నాడు ) అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు తెల్ల రంగు టోపీ, తెలుపు గడ్డం ఉన్న ఓ వ్యక్తి ఆపిళ్లను ప్యాక్ చేస్తున్నాడు.


అయితే ఆపిళ్లను ప్యాక్ చేసే క్రమంలో వాటిని నోటి వద్దకు తీసుకొచ్చి ఉమ్మి అంటిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. తర్వాత ఆ ఉమ్మి అంటుకున్న పండ్లను అలాగే ప్యాక్ చేస్తున్నట్లు ఈ 17 సెకన్ల వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను జూన్ 21వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు పోస్టు చేయగా ఇప్పటి వరకు 147.9K వ్యూస్ వచ్చాయి. 1473 సార్లు రీట్వీట్ చేశారు. 1821 లైకులు వచ్చాయి. 43 బుక్‌మార్క్‌లు, 70 కోట్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లూ చేస్తున్నారు. వందల కొద్దీ వచ్చిన కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు, ఈ వీడియో ఎవరు తీశారు, ఏ ప్రాంతం, ఏ వీడియో ఈమధ్యే తీసిందా లేదా గతంలోని వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోందా అనే వివరాలేవీ ప్రస్తుతానికి తెలియవు.