Video Game Tetris: అమెరికాకు చెందిన ఓ కుర్రాడు క్లాసిక్ కంప్యూటర్ గేమ్ టెట్రిస్‌ను ఓడించాడు. గతంలో ఈ ఘనతను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత ‘బ్లూ స్కూటీ’గా గుర్తింపు పొందిన విల్లీస్ గిబ్సన్ (13) దానిని బద్దలుకొట్టాడు. పజిల్ గేమ్ నింటెండో వెర్షన్ ‘కిల్ స్క్రీన్’ కి చేరుకున్న మొదటి వ్యక్తి అయ్యాడు. ఈ వారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో ముగింపులో విల్లీస్ "ఓరి దేవుడా!" అంటూ పదే పదే అరుస్తున్నాడు. ఆటలో మొదటి 35 నిమిషాల పాటు అతను కంట్రోలర్‌లో తన వేళ్లను వేగంగా స్క్రోల్ చేస్తూఎక్కువగా కదలకుండా కూర్చున్నాడు. వీడియో చివరలో మాత్రం రచ్చ రచ్చ చేశాడు.



ఇరాన్ పేలుళ్లలో కనీసం 103 మంది దుర్మరణం, 170 మందికి గాయాలు - ప్రభుత్వం వెల్లడి




    జనరల్ ఖాసీం సులేమానీ హత్య జరిగి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సంతాప కార్యక్రమంలో ఈ పేలుళ్లు జరిగాయి.


ఇప్పటి వరకు ఏ మానవుడు ఈ ఘనతను సాధించలేదని క్లాసిక్ టెట్రిస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రెసిడెంట్ విన్స్ క్లెమెంటే అన్నారు. చాలా ఏళ్ల కిందట వరకు ఇది అసాధ్యం అని అందరూ భావించారని, కానీ దీనిని విల్లీస్ చేరుకున్నాడని అన్నారు. సోవియట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆలోచన నుంచి టెట్రిస్ గేమ్ పుట్టింది. ఇది చాలా సులభమైన ఆట. దీనిని ఒక సారి ఆడితే ఎవరైనా సులువుగా వ్యసనంగా మారుతంది. ఇందులో ఆటగాళ్లు పడిపోతున్న బ్లాక్‌లను ఒకదానికొకటి సరిపోయేలా తిప్పాల్సి ఉంటుంది.  ఆటగాడు 29 లెవల్ చేరుకుంటే  బ్లాక్‌లు వేగంగా పడిపోతాయి. మనుషులు ప్రతిస్పందించలేని విధంగా బ్లాకులు వేగంగా కదులుతాయి.



రూ.ఆరు వేలలోపే 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ - చవకైన ఫోన్ కొనాలంటే బెస్ట్ ఆప్షన్!




    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 8.


  
డిసెంబరు 21 వరకు విల్లీస్ కూడా గరిష్టంగా 157 లెవల్‌కు చేరుకున్నాడు. అక్కడ చేసిన పొరపాటుతో బ్లాక్‌ల్లో ఒకే వరుస అదృశ్యమై, గేమ్ స్తంభించిపోయింది. తాజాగా జరిగిన పోటీలో విల్లీస్ గిబ్సన్ దానిని బ్రేక్ చేశాడు. దీంతో క్లాసిక్ టెట్రిస్ వరల్డ్ ఛాంపియన్ ఫ్రాక్టల్161 ఆడుతున్న ఇతర ఆటగాళ్లు లైవ్‌లో కేకలు వేశారు. విల్లీస్ సాధించాడు అంటూ సంబరాలు చేసుకున్నారు. టెట్రిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాయా రోజర్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 2024లో గేమ్ 40వ వార్షికోత్సవానికి ముందు ఇది తగిన విజయమని చెప్పారు. ఈ అసాధారణ విజయాన్ని సాధించినందుకు 'బ్లూ స్కూటీ'కి అభినందనలు అంటూ గేమింగ్ సంస్థ ఒక ప్రకటన తెలిపింది.



జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అలెర్ట్ - ట్రాయ్ ఏం చెప్తుంది?




    ఫేక్ మెసేజ్‌ల గురించి యూజర్లకు అలెర్ట్ చేయాలని జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ కంపెనీలను ట్రాయ్ కోరింది.