Iran Blasts News: 2020లో జరిగిన అమెరికా వైమానిక దాడిలో మరణించిన ప్రముఖ ఇరానియన్ జనరల్‌ వర్థంతి కార్యక్రమంలో జరిగిన పేలుళ్లలో కనీసం 103 మంది మరణించారు. మరో 170 మందికి పైగా గాయపడినట్లు ఇరాన్‌లోని ప్రభుత్వ మీడియా బుధవారం (జనవరి 3) ప్రకటించింది. ఓ సీనియర్ అధికారి ఈ పేలుళ్లను ‘‘టెర్రరిస్ట్’’ దాడిగా పేర్కొన్నారు. అయితే, గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై మధ్యప్రాచ్యంలో (మిడ్ ఈస్ట్) ఉద్రిక్తతల వేళ ఈ పేలుళ్ల వెనుక ఎవరున్నారనేది మాత్రం తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ పేలుళ్లకు తామే బాధ్యులమని ప్రకటించలేదు.


రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన ఎలైట్ ఖుద్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సులేమానీ హత్య జరిగి మూడేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు నాలుగో వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ పేలుళ్లు జరిగాయి. జనవరి 2020లో ఇరాక్‌లో అమెరికా డ్రోన్ దాడిలో ఆయన మరణించారు. రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 820 కిలో మీటర్ల (510 మైళ్ళు) దూరంలో ఉన్న కెర్మాన్‌లోని అతనిని సమాధి చేసిన ప్రాంతానికి సమీపంలోనే తాజా పేలుళ్లు సంభవించాయి.


ఆ పేలుళ్ల ఘటన నుంచి కొంత మంది పారిపోగా.. ఆ ప్రయత్నంలో ఎంతో మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మొదటి పేలుడు జరిగిన 15 నిమిషాల తర్వాత రెండో పేలుడు సంభవించినట్లు వీడియో ఫుటేజీ ప్రకారం గుర్తించారు. మొదటి పేలుడు జరిగిన తర్వాత వెంటనే ప్రతిస్పందించే ఎమర్జెన్సీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని రెండో పేలుడు చేశారు. ఎక్కువ మంది ప్రాణనష్టాన్ని కలిగించడానికి తీవ్రవాదులు తరచుగా ఈ విధానాన్ని ఉపయోగిస్తారు.


పేలుడు సమయంలో ప్రజల కేకలు


కెర్మాన్ డిప్యూటీ గవర్నర్, రెహమాన్ జలాలీ, దాడిని "ఉగ్రవాదం" అని అనేశారు. కానీ, దాని గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అసలే ఇరాన్ కొన్ని మిలిటెంట్ సంస్థలతో, ఇతర వేర్పాటు వాదాలతో చాలా శత్రువులను కలిగి ఉంది. ఇరాన్ హమాస్‌తో పాటు లెబనీస్ షియా మిలీషియా హిజ్బుల్లా, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చింది. దీంతో శత్రుత్వం బాగా పెంచుకుంది.


ఖాసీం సులేమానీ ఇరాన్ రీజినల్ మిలిటరీ కార్యకలాపాలకు ఆర్కిటెక్ట్ గా చెప్తారు. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్‌కు వ్యతిరేకంగా 2011 అరబ్ స్ప్రింగ్ నిరసనలు సివిల్, రీజినల్ వార్ గా మారిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని రక్షించడంలో కూడా సహాయం చేసినట్లు చెబుతారు.