Miami Plane Crash: రెడ్ ఎయిర్ విమానం బుధవారం క్రాష్ ల్యాండ్ అయింది. డొమినిక్ రిపబ్లిక్ నుంచి మియామీ వెళ్తున్న ఈ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 126 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.






ఇలా జరిగింది


డొమినికన్ రిపబ్లిక్ నుంచి మియామీ వెళుతున్న రెడ్ ఎయిర్ విమానం బుధవారం క్రాష్ ల్యాండ్ అయింది. విమానాశ్రయంలో కూలిపోయిన తర్వాత విమానం మంటల్లో చిక్కుకుంది. ముగ్గురు విమాన ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు మియామి-డేడ్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు.










ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. ఇతర ప్రయాణీకులను విమానం నుంచి టెర్మినల్ వరకు బస్సులో తరలించారు.


మియామి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. విమానంలో వెంటనే మంటలు చెలరేగాయని, అయితే ప్రయాణికులకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదని విమానసంస్థ అధికారులు తెలిపారు.


Also Read: Maharashtra Political Crisis: 'మహా' రాజకీయంలో మరో మలుపు- సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్