బ్రిటీష్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్, 13 జులైలో జరిగిన మొదటి రౌండ్‌లో విజయం సాధించారు. రిషి రాజీనామాతోనే బోరిస్ జాన్సన్ ప్రభుత్వం పతనమైంది. ఇప్పుడు ఆయనే ప్రధానమంత్రి రేస్‌లో ఉన్నారు. అందుకు ముందుగా కన్జర్వేటివ్ పార్టీలో విజయం సాధించాల్సి ఉంటుంది. 


అలా ప్రధానమంత్రి రేస్‌లో ఉండాల్సిన నాయకుడి కోసం కన్జర్వేటివ్ పార్టీలో ఓటింగ్ జరుగుతోంది. ఆ ఓటింగ్‌కు సంబంధించిన
కన్జర్వేటివ్ ఎంపీల తొలి బ్యాలెట్‌లో రిషి విజయం సాధించారు. ఈ పోలింగ్‌లో రిషి సునక్‌కు 88 ఓట్లు రాగా, పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ 50 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.