Titanic Sub Was Mousetrap: ఓషియన్ గేట్ సీఈఓ స్టాక్టన్ రష్ స్నేహితుడు కార్ల్ స్టాన్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయోగం విఫలమౌతుందని ముందే స్టాక్టన్‌కు తెలుసన్నారు. కానీ బిలియనీర్లను నమ్మించడానికి మౌస్ ట్రాప్ పథకం వేశాడని చెప్పారు. టైటానిక్ అవశేషాలను గుర్తించేందుకు సబ్ మెర్సిబుల్‌లో వెళ్తూ అది పేలి ఓషియన్ గేట్ సీఈఓ స్టాక్టన్ రష్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బ్రిటీష్ అన్వేషకుడు హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ జలాంతర్గామి నిపుణుడు పాల్-హెన్రీ నర్జియోలెట్, పాకిస్తానీ-బ్రిటీష్ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, సబ్ ఆపరేటర్ సైతం మరణించారు. తమ ప్రయోగం విషాదంగానే ముగుస్తుందని రష్‌కు తెలుసని కానీ కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు స్కై న్యూస్‌ పేర్కొంది.


చివరి వ్యక్తి అతడేనేమో?
 స్టాక్టన్ రష్ స్నేహితుడు కార్ల్ స్టాన్లీ 60 మినిట్స్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కార్బన్ ఫైబర్, టైటానియం క్రాఫ్ట్ ప్రమాదకరమని తన స్నేహితుడికి చెప్పినట్లు వెల్లడించారు. ‘ప్రయోగం విషాదంగా ముగిసిపోతుందని అతనికి ఖచ్చితంగా తెలుసు. మానవ చరిత్రలో నిలవాల్సిన ప్రయోగాన్ని అలంకారప్రాయంగా చేశాడు. అక్షరాలా మరియు అలంకారికంగా బయటపడ్డాడు. ఇద్దరు బిలియనీర్లను ఒకేసారి హత్య చేసేందుకు, వారితోనే డబ్బు చెల్లించేలా చేసిన చివరి వ్యక్తి అతనే అయ్యుంటాడు’ అంటూ ఆరోపించాడు.
2019లో బహామాస్‌లో రష్‌తో టెస్ట్ డైవ్‌కు వెళ్లిన అనుభవాన్ని కూడా కార్ల్ స్టాన్లీ పంచుకున్నారు.  స్టాక్టన్ రష్ మనస్సులో సందేహం లేదని కార్బన్ ఫైబర్ ట్యూబ్ విఫలమైన యాంత్రిక భాగం అని నమ్మాడని స్టాన్లీ చెప్పాడు. అదే టైటాన్ పేలుడుకు దారితీసిందని, ప్రతి మూడు నుంచి నాలుగు నిమిషాలకు పెద్ద ఎత్తున తుపాకీ కాల్పుల వంటి శబ్దాలు వచ్చాయని వివరించారు. సముద్రంలో చాలా దూరంలో ఉన్నప్పుడు వినిపించేంత పెద్ద సౌండ్‌లా ఉందన్నాడు.


ఎన్ని సార్లు చెప్పినా వినలేదట
 స్టాక్టన్ రష్‌తో ఓడ కార్బన్ ఫైబర్ హల్ "విచ్ఛిన్నం" గురించి తన అభిప్రాయం, అనుమానాలను స్టాన్లీ వ్యక్తం చేశాడు, పలు సార్లు ఫోన్ కాల్స్, ఈమెయిల్‌లల్లో "ఇది మరింత దిగజారిపోతుందని చెప్పినట్లు వెల్లడించాడు. ప్రయోగం ఏవిధంగా విఫలమౌతుందో వివరంగా చిత్రీకరించి వివరించినా రష్ తన మాట వినలేదన్నారు. అతను చరిత్రలో నిలిచిపోవడానికి తన జీవితంతో పాటు తన కస్టమర్ల జీవితాలను పణంగా పెట్టాడని స్టాన్లీ ఇంటర్వ్యూలో చెప్పాడు.
యుఎస్ కోస్ట్ గార్డ్ సమాచారం మేరకు.. కొన్ని వారాల క్రితం టైటాన్ సబ్‌లో మిగిలి ఉన్న వాటి నుండి మానవ అవశేషాలను పలువురు నిపుణులు సేకరించారు. చిన్న సబ్‌మెర్సిబుల్ నుంచి వెలికితీసిన మాంగిల్డ్ శిథిలాలు తూర్పు కెనడాకు తరలించారు. ఇది అతి కష్టమైన సెర్చ్, రికవరీ ఆపరేషన్. సముద్రపు అడుగుభాగంలో టైటానిక్ బో నుంచి 1,600 అడుగుల దూరంలో ఒక శిధిలాల క్షేత్రం కూడా కనుగొనబడింది. ఇది సముద్ర ఉపరితలం నుంచి రెండు మైళ్ల కంటే ఎక్కువ లోతులో ఉంది. న్యూఫౌండ్‌లాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial