Google Employees Salary: టెక్ జెయింట్ గూగుల్, భారీ స్థాయిలో ఉద్యోగాలు తీసేసి ఇటీవల అంతర్జాతీయ మీడియాకు ఎక్కింది. ఆర్థిక మందగమనం నడుస్తున్న ఈ కష్టకాలంలో ఖర్చులు భరించలేకపోతున్నాం అన్నది ఆ టెక్నాలజీ సంస్థ చెప్పిన సాకు. ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని చెబుతూనే, కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలతో మరోసారి హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది.
గూగుల్ ఉద్యోగుల శాలరీ ప్యాకేజీల లిస్ట్ లీక్ అయింది, బిజినెస్ ఇన్‌సైడర్ చేతికి చిక్కింది. గూగుల్, తన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఏడు అంకెల స్థాయిలో (రూపాయల్లో) బేసిక్ పే ఆఫర్ చేస్తోందని ఆ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చింది. టెక్ జెయింట్ ఉద్యోగులు ఏడాది ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే, ఇతర కంపెనీల ఉద్యోగులు కుళ్లి కుళ్లి ఏడవడం ఖాయం. నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో, కంపెనీ సగటు శాలరీ ప్యాకేజీ 2,79,802 డాలర్లు. మన రూపాయల్లో మారిస్తే ఇది దాదాపు 2.30 కోట్ల రూపాయలు. ఇది గ్రాస్ శాలరీ కాదు, బేసిక్ పే మాత్రమే. ఉద్యోగులకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాలతో కలుపుకుంటే వచ్చే గ్రాస్ శాలరీ దీని కంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. పైగా, ఇది యావరేజ్ శాలరీ, హైయెస్ట్ అమౌంట్ కాదు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు హైయెస్ట్ పే
గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు హైయెస్ట్ శాలరీ పొందుతున్నారని లీక్ అయిన గూగుల్ డాక్యుమెంట్స్‌ను బట్టి తెలుస్తోంది. 2022 సంవత్సరంలో, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీసుకున్న గరిష్ట 'బేసిక్ పే' 7,18,000 డాలర్లు. రూపాయల్లోకి మారిస్తే, దాదాపు 5.89 కోట్ల రూపాయలు. లీకైన డేటాలో 12,000 మంది అమెరికన్ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. ఆ డేటాలో అమెరికా శాశ్వత ఉద్యోగుల పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇతర దేశాల ఉద్యోగుల పేర్లు ఆ లిస్ట్‌లో లేవు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు... గూగుల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ అనలిస్ట్, ఇతర డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులకు కూడా భారీ జీతం అందుతోంది. ఈ పోస్టులన్నింటిలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతం ఆరు అంకెల్లో (డాలర్లలో) ఉంటుంది. ఉద్యోగులకు బేసిక్ శాలరీతో పాటు బోనస్, స్టాక్ ఆప్షన్, ఇతర పెర్క్స్ కూడా లభిస్తాయి. 2022 సంవత్సరంలో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గరిష్టంగా రూ. 5.90 కోట్లు డ్రా చేశారు. ఇది కాకుండా ఇంజినీర్ మేనేజర్ రూ. 3.28 కోట్లు, ఎంటర్‌ప్రైజ్ డైరెక్టర్ (సేల్స్) రూ. 3.09 కోట్లు, లీగల్ కార్పొరేట్ కౌన్సెల్ రూ. 2.62 కోట్లు, సేల్స్ టీమ్ రూ. 2.62 కోట్లు, డిజైన్ టీమ్ దాదాపు రూ. 2.58 కోట్లు అందుకున్నారు. ప్రోగ్రామ్ మేనేజర్, రీసెర్చ్ సైంటిస్ట్ వంటి హోదాల్లో పనిచేస్తున్న వారికి కూడా కోట్ల రూపాయల ప్యాకేజీని ఇంటి పట్టుకెళ్లారు.
ఈ కంపెనీల్లోని ఉద్యోగులకు కూడా బ్రహ్మాండమైన జీతం
MyLogIQ, వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్స్ ప్రకారం... గూగుల్‌తో పాటు మరికొన్ని గ్లోబల్ కంపెనీలు కూడా కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఆ కంపెనీల్లో ముఖ్యమైనది మెటా (Meta). గూగుల్ తర్వాత ఎక్కువ జీతాలు ఇస్తున్న కంపెనీ ఇదే. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ (Alphabet Inc.) పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అమెజాన్ (Amazon), మైక్రోసాఫ్ట్ (Microsoft), ట్విట్టర్ (Twitter) వంటి కంపెనీలు కూడా బలమైన ప్యాకేజీలు అందిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: హిస్టారికల్ మూమెంట్ చూద్దామనుకుంటే హిస్టీరియా తెప్పించింది, స్టాక్ మార్కెట్‌తో ఇట్లుంటది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial