Stock Market Opening 21 July 2023:


స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం క్రాష్‌ అవుతున్నాయి. ఆరంభం నుంచే బెంచ్‌మార్క్‌ సూచీలు ఎరుపెక్కాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం.. ఐటీ కంపెనీల షేర్లు కుదేలవ్వడం.. ఇన్వెస్టర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. నేటి ఉదయం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 170 పాయింట్లు తగ్గి 19,808 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 650 పాయింట్లు పతనమై 66,919 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ ఇండెక్స్‌ భారీగా క్రాష్‌ అయింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 67,571 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,907 వద్ద మొదలైంది. 66,822 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,190 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 650 పాయింట్ల నష్టంతో 66,919 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 19,979 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,800 వద్ద ఓపెనైంది. 19,766 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,887 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 170 పాయింట్లు పతనమై 19,808 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 46,063 వద్ద మొదలైంది. 45,027 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,369 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 113 పాయింట్లు తగ్గి 46,073 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, దివిస్‌ ల్యాబ్‌, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, రిలయన్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టపోయాయి. మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎక్కువ పతనం అయ్యాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.60,440 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1500 పెరిగి రూ.79,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 తగ్గి రూ.25,240 వద్ద ఉంది.


Also Read: ఇన్ఫీ నికర లాభంలో 11% గ్రోత్‌! రెవెన్యూ గైడెన్స్‌లో కోత - మళ్లీ నిరాశే!!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial