నెవడాలో నెగ్లేరియా ఫౌలేరీ ఇన్‌ఫెక్షన్‌తో రెండేళ్ల బాలుడు రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ వ్యాధిని బ్రెయిన్ ఈటింగ్ అమిబా అని కూడా అంటారు. ఇంటికి సమీపంలో ఉన్న వాటర్‌లో ఆడుకుంటున్న టైంలోనే ఈ ఇన్‌ఫెక్షన్ సోకి ఉంటుందని ప్యామిలీ మెంబర్ అనుమానిస్తున్నారు. 


కుమారుడి మరణంపై బాలుడి తల్లి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బిడ్డ తన కుమారుడని చెప్పుకొచ్చారు. ఏడు రోజులు మృత్యువుతో పోరాడుతూ తన బిడ్డ స్వర్గానికి తన తండ్రి వద్దకు వెళ్లిపోయారని రాసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన  వాళ్లు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు బతకలేదని తన కుమారుడు మాత్రం ఏడు రోజులు ఉన్నాడని చెప్పుకొచ్చారు.  


తన బిడ్డే తనకు నిజమైన హీరో అనిఅన్నారు. అలాంటి మంచి బిడ్డను ఇచ్చిన దేవుడి ఎప్పుడూ రణపడి ఉంటానని చెప్పారు. ఏదో ఒక రోజు తన బిడ్డను స్వర్గంలో కలుసుకుంటాని అన్నారు. 


ఫ్వూ లక్షణాలు కనిపించిన వెంటనే బాలుడి ఫ్యామిలీకి అనుమానం వచ్చింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు మెనింజైటీస్‌ అనుకున్నారు. తర్వాత అది మెనింజైటీస్ కాదు ప్రమాదకరమైన బ్రెయిన్ ఈటింగ్ అమిబా అని గుర్తించారు. 2023 ఫిబ్రవరిలో అమెరికాలో ఇదే వ్యాధితో 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. 


సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తన రెండేళ్ల చిన్నారికి చికిత్స అందించడానికి నిరాకరించిందని బాలుడి తల్లి బ్రియానా ఫేస్‌బుక్ పోస్ట్‌ ఆరోపించారు. తన కొడుకు ఎటువంటి రోగం నుంచైన ప్రాణాలతో బయటపడే శక్తి ఉన్నవాడని పేర్కొన్నారు. ఆమె ఆరోపణలపై CDC స్పందించలేదు.


CDC ప్రకారం, నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటి వెచ్చని మంచినీటి వాతావరణాలలో కనిపించే ఒక రకమైన అమీబా (ఏకకణ జీవి). ఇది నీరు ద్వారా ముక్కులోకి వెళ్లి మెదడుకు సోకుతుంది. ఈ కారణంగా దీనిని బ్రెయిన్-ఈటింగ్ అమీబా అని అంటారు. ఇది అరుదైన వ్యాధి. అత్యంత ప్రాణాంతకమైనది. దాని బారిన పడితే బ్రతికే శాతం చాలా తక్కువ.


నెగ్లేరియా సోకిన తరువాత ఒకటి నుంచి 12 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. CDC ప్రకారం, లక్షణాలు కనిపించిన తర్వాత ఒకటి నుంచి 18 రోజులలోపు వ్యక్తులు మరణిస్తారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, మూర్ఛ, ప్రధాన లక్షణాలు. నీటి నుంచి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, బయట చెరువులు, జలాశయాల్లో స్నానాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని CDC అధికారులు సూచిస్తున్నారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial