Viral News: 


దుబాయ్‌లో ఘటన..


దుబాయ్ పోలీసులు టెక్సాస్‌కి చెందిన ఓ మహిళను అరెస్ట్ చేశారు. పబ్లిక్‌లో గట్టిగా కేకలు పెట్టినందుకు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరిచినందుకే అరెస్ట్ చేస్తారా..అనుకోవచ్చు కానీ...దాని వెనకాల ఓ పెద్ద కథ ఉంది. టెక్సాస్‌లోని హూస్టన్‌కి చెందిన టియెరా యంగ్‌ అలెన్ ఫ్యామిలీ దాదాపు రెండు నెలలుగా దుబాయ్‌లోనే స్ట్రక్ అయిపోయింది. ఫ్యూచర్ ఏంటో అర్థం కాక తెగ టెన్షన్ పడుతోంది ఆ కుటుంబం. తన కూతురి పాస్‌పోర్ట్‌ని దుబాయ్ పోలీసులు సీజ్ చేశారని చెబుతోంది అలెన్. హూస్టన్‌లో ట్రక్‌ డ్రైవర్‌గా పని చేస్తోంది యంగ్ అలెన్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. ప్రస్తుతం ఆమెపై ట్రావెల్ బ్యాన్ విధించారు. పోలీసులు ఆమెని విచారిస్తున్నారు. అలెన్ తల్లి టినా చెప్పిన వివరాల ప్రకారం...అలెన్ ఈ ఏడాది మే నెలలో తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌కి UAEకి వెళ్లింది. అక్కడ వాళ్ల కార్ యాక్సిడెంట్‌ కేసులో ఇరుక్కుంది. వెంటనే పోలీసులు వచ్చి ఆ కార్‌ని సీజ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు  కాలేదు. అయినా దుబాయ్ పోలీసులు కార్‌ నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాదాపు వారం రోజుల పాటు కస్టడీలో ఉంచుకుని ఆ తరవాత విడుదల చేశారు. అతడితో పాటు కార్‌లో ఉన్న అలెన్ క్రెడిట్ కార్డ్‌లు,ఐడీ కార్డ్‌లతో పాటు పర్సనల్ ఐటమ్స్‌నీ స్వాధీనం చేసుకున్నారు. వాటిని కలెక్ట్ చేసుకునేందుకు అలెన్ వెళ్లింది. 


అధికారిపై అరిచిన మహిళ..


ఇక్కడే అధికారులు తిరకాసు పెట్టారు. డబ్బులు కడితే తప్ప అవన్నీ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఇవ్వాల్సిందేనని అలెన్ డిమాండ్ చేసింది. దీంతో అక్కడ ఓ అధికారి ఆమెపై గట్టిగా అరిచాడు. అప్పటికే సహనం కోల్పోయిన అలెన్ కూడా ఆ అధికారిపై గట్టిగా అరిచింది. అంతే...వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో మహిళలు ఎవరూ గొంతు పెంచి మాట్లాడడానికి వీల్లేదు. గట్టిగా అరవకూడదు. అలా చేస్తే పోలీసులు ఊరుకోరు. కేసు నమోదు చేసి జైల్లో పెడతారు. ఇప్పుడు అలెన్‌కి అదే జరిగింది. మిగతా దేశాలతో పోల్చి చూస్తే UAEలో పబ్లిక్ కండక్ట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. దుబాయ్‌ పర్యటనకు వచ్చే అమెరికన్లు ఎవరైనా సరే...ఇక్కడి రూల్స్‌ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.  


Also Read: Manipur Viral Video: మణిపూర్ హింసపై విపక్షాల ఆందోళన, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్