srilanka presidential chair :  శ్రీలంక  అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పరారయ్యారు. ఆయన బంగ్లాను ఆందోళన కారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో దృశ్యాలు వైరల్  అయ్యాయి. చాలా మంది ఆయన కుర్చీని కూడా ఆక్రమించుకున్నారు. అందులో కూర్చుని ఫోటోలు దిగి తామే అధ్యక్షులమయ్యామని సంతోషపడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 






 





గోటబయ పారిపోయినప్పటి నుండి ఆందోళనకారుల అధీనంలోనే అధ్యక్ష బంగ్లా ఉంది. రోజంతా జనం వచ్చి కుర్చీలో కూర్చోవడం ఫోటోలు దిగడం కామన్‌గా మారిపోయింది. 



 






 



అయితే ప్రస్తుతం అధ్యక్ష భవనాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  కొత్త అధ్యక్షుడు వచ్చే వరకూ ఆ సీట్లో కూర్చునే వరకూ బలగాలు కాపలా కాస్తున్నాయి.