Fact Check :  సోషల్ మీడియా అంటే పిచ్చివాళ్ల స్వర్గం అని కొంత మంది ఫేక్ న్యూస్ బారిన పడిన వారు  నిర్వేదంగా చెబుతూ ఉంటారు. ఈ పేక్ న్యూస్ ప్రచారానికి వాళ్లు వీళ్లు అనే  తేడా ఉండదు. చివరికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు అయినా తప్పదు. ఈ సారి కొంత మంది అసలు చంద్రుడి మీద మొదట దిగింది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాదు. నాసా మనల్ని మోసం చేసింది. కావాలంటే ఇదిగో సాక్ష్యం అంటూ.. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ వాడినట్లుగా మ్యూజియంలో ఉన్న షూ అడుగు భాగం.. అలాగే మొదటి సారి చంద్రుడిపై కాలు మోపినప్పుడు తీసిన ఫోటోను పక్క పక్కన పెట్టి కంపేరిజన్ ఇచ్చాడు. ఆ షూ కి...ఫుట్ ప్రింట్‌కు లింక్ లేదు. ఇంత కంటే సాక్ష్యం  ఏమి కావాలని ఆయన ప్రశ్నించాడు.నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొట్టమొదట చంద్రుడిపై అడుగుపెట్టలేదని వాదించాడు. 



ఆయన వాదన చాలా మందికి నచ్చింది. సహజమే. సోషల్ మీడియా అంటేనే అదని ముందుగా చెప్పుకున్నారు. వారు వైరల్ చేసుకున్నారు. దీంతో చరిత్రపై కొత్త అనుమానాలు ముసురుకున్నాయి. అయితే నాసా ఈ చిల్లర వ్యవహారాలపై ఇంకా దృష్టి పెట్టలేదు. కానీ ఇండిపెడెంట్ ఫ్యాక్ట్ చెకర్లు మాత్రం ఇందులో అసలు విషయం బయట పెట్టారు. ఆ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వారు ఫోటోలు నిజమైనవే పెట్టారు. కానీ విషయం మాత్రం అబద్దం చెప్పారని తేల్చారు. 





ఆ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వ్యక్తి ఉద్దేశం.. తొలి అడుగు పెట్టింది ఆర్మ్ స్ట్రాంగ్ కాదని.. అతనితో పాటే అక్కడ దిగిన ఎడ్విన్ ఆల్ట్రిన్‌ దని చెప్పడం. అయితే ఆ బూట్లు ఎవరూ వాడలేదు. అంతరిక్షానికి రెండు రకాల షూట్‌లతో వెళ్లారు తొలి బృందం. స్పేస్‌లో నడిచే  బూట్లు వేరుగా ఉంటాయి. విషయం తెలిసి కూడా మిస్ లీడ్ చేసేలా ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి తిప్పుతున్నారు. 





అపోలో 11 ప్రయోగంలో చంద్రుడి మీదకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్ట్రిన్‌తో పాటు... మైఖెల్ కొల్లిన్స్ వెళ్లారు. అయితే కొల్లిన్స్ కమాండ్ మాడ్యూల్ లో ఉండిపోయారు. ఇద్దరూ కిందకు దిగారు. ఈ అంశంపైనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.