చైనీస్‌ ఫుడ్‌ను మన వాళ్లు కొంత మంది ఇష్టంగా తింటారు. కానీ చైనీస్ ఫుడ్ అంటే పాములు, కప్పలు అన్న అభిప్రాయం ఉంది. అయితే ధాయ్‌లాండ్‌లోనూ అలాంటి ఫుడ్ ఉంటుంది. ధాయ్ ఫుడ్‌కు కూడా డిమాండ్ ఉంటుంది. అయితే చైనీయులు.. ధాయ్‌లాండ్ వాసులు ఇండియా ఫుడ్‌ను తింటారా ?. ధాయ్‌లాండ్‌లో ఇండియన్ రెస్టారెంట్లకు ఇండియన్స్ కాకుండా ధాయ్ వాసులు వస్తారా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇండియాలో ధాయ్, చైనీస్ రెస్టారెంట్లలో కనిపించేది ఇండియన్సే. కానీ ఆయా దేశాల్లో ఇండియన్ రెస్టారెంట్లలో కూడా ఇండియన్సే కనిపిస్తారు. చైనీయులు..ధాయ్ వాసులు పెద్దగా కనిపించరు. అదీ సౌతిండియా ఫుడ్ అయితే మరీ కష్టం.


కానీ ధాయ్‌లాండ్‌లో ఉన్న ఓ సౌతిండియా రెస్టారెంట్‌కు ఓ దాయ్ వ్యక్తి వచ్చాడు. అచ్చమైన దక్షిణాది భోజనం ఆర్డర్ చేశాడు. అక్కడ సిబ్బంది ఆకేసి..పప్పేసి.. పచ్చడి కూడా వేసి...అన్నిరకాల కూరలు వడ్డించారు. ఆ ధాలీని తినడం ప్రారంభించిన దగ్గర్నుంచి అతనే  వీడియో కూడా తీయించుకున్నాడు. ఎందుకంటే అతను యూట్యూబర్ కూడా. దక్షిణాదికి చెందిన ఒక్కో వంటకం తింటున్నప్పుడు  అతను ఎలాంటి ఫీలింగ్స్ పెట్టాడో ఆ వీడియోలో కనిపిస్తూంటాయి. నవరసాలు దక్షిణాది వంటకాల్లో ఉన్నాయని ఆ వీడియోలో ఆ యూట్యూబర్ ఫీలింగ్స్ చూస్తే అర్థమైపోతుంది.


ఆ యూట్యూబర్ రకరకాల  వంటలను రుచిచూసి.. ఆ ఫీలింగ్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ సారి దక్షిణాది భోజనాన్ని రుచి చూశాడు. ఆ వీడియో  ఇప్పుడు వైరల్ అవుతోంది. అతనిపేరు మార్క్ వీన్స్. 






నిజానికి దక్షిణాది వంటకాలు.. చాలా స్పైసీగా ఉంటాయి. అవి కూడా స్పైసీగానేఉన్నాయి. అయినప్పటికీ మార్క్ వీన్స్ వాటిని ఎంజాయ్ చేశాడు కానీ మంట అని అనుకోలేదు. అందుకే ఆ వీడియో ఇండియన్స్‌కు కూడా తెగ నచ్చేసింది.