అమెరికా, నాటో సంయుక్త బలగాలు ఈ ఏడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని వీడాయి. అంతకు కొన్ని రోజుల ముందే తాలిబన్లు దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం దేశం పేరు మార్చి సొంతంగా పరిపాలన చేపట్టారు. భవిష్యత్తులో అమెరికాతో సంబంధాలు కొనసాగించడంపై తాలిబన్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. దేశంలో అతివాద గ్రూపులు ఉన్నట్లయితే అమెరికాతో సంబంధాలు కొనసాగించడం కష్టమేనని తాలిబన్లు పేర్కొన్నారు. నేటి నుంచి రెండు రోజులపాటు జరగనున్న తాలిబన్ , అమెరికా ప్రతినిధుల భేటీపై పాక్, చైనాలు ఆసక్తి చూపిస్తున్నాయి.


ఇస్లామిక్ స్టేట్ లాంటి అతివాద గ్రూపుల ప్రభావం తమ దేశంలో పెరిగిపోతే అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించలేమని తాలిబన్ రాజకీయ అధికార ప్రతినిధి సుహైల్ షాహిన్ ద అసోసియేటెట్ ప్రెస్‌కు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ తమ దేశంలో కొనసాగితే యుఎస్‌తో తాలిబన్లు కలిపి పనిచేస్తారా అనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. తాము సొంతంగానే ఐఎస్ఐఎస్ సంస్థను ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. 


Also Read: ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్ పని చేయట్లేదని.. ఆ సైట్స్ మీద ఎగబడ్డారుగా యూజర్లు


ఐఎస్ఐఎస్ కలవరం..
అఫ్గాన్ ప్రజలను ఇస్లామిక్ స్టేట్ కలవరానికి గురిచేస్తోంది. ఇటీవల మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటనలో దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాలిబన్ ప్రతినిధులు శనివారం, ఆదివారం ఖతార్ రాజధాని దోహాలో సమావేశం కానున్న సందర్భంగా తాలిబన్ ప్రతినిధి షాహిన్ మీడియాతో మాట్లాడారు. అమెరికా బలగాలు అఫ్గాన్‌ను వీడిన తరువాత తాలిబన్ నేతలతో జరుగుతున్న తొలి భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 


Also Read: సౌదీ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు.. హైతీ తిరుగుబాటు దారుల పనేనని అనుమానం !


అమెరికా పౌరులతో పాటు ఇతర దేశాల వారిని అఫ్గాన్ వీడేందుకు అనుమతించడం, అమెరికాతో రిలేషన్ ఉన్న వారిపై సైతం ఆంక్షలు ఎత్తివేయాలని ఈ భేటీలో తాలిబన్లతో చర్చ జరగనుంది. పాకిస్తాన్ ప్రతినిథులతో జరిగిన సమావేశంలో అఫ్గాన్‌కు మద్దతు తెలిపాలని పాక్ కోరింది. అమెరికా నుంచి ఆర్థిక సహాయం అందితే అఫ్గాన్‌లో పరిస్థితులు మారతాయని పాక్ ఆశాభావం వ్యక్తం చేసింది. మానవ హక్కులకు సైతం తాలిబన్లు ప్రాధాన్యత ఇవ్వాలని పాక్ భావిస్తోంది. 


Also Read: కెనడాలో అంతుచిక్కని బ్రెయిన్ డిసీజ్.. పిచ్చిగా ప్రవర్తిస్తున్న బాధితులు.. ఆరుగురు మృతి


అమెరికా విల్సర్ సెంటర్‌లో ఆసియా ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ ట్విట్టర్‌లో స్పందించారు. నార్త్ అఫ్గాన్ లోని కుందుజ్ లో షియా ముస్లింల మసీదు దాడి తామే చేశామని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. ఇది నిజమైతే అఫ్గాన్ లో ఉగ్రవాదంపై చైనా విచారం వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని ట్వీట్లో పేర్కొన్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి