Spain Flash Floods Catastrophic Deluge Leaves Cities In Ruins: భారీ వర్షం వస్తే చక్కగా ఇంట్లో ఉంటే ఏం కాదని అనుకుంటూ ఉంటారు. కానీ మారిపోయిన వాతావరణ పరిస్థితుల్లో భారీ వర్షం వస్తే ఇల్లు కూడా ఉంటుందో.. ఊడ్చుకెళ్తుందో తెలియని పరిస్థితి. మన దేశంలో ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ చాలా వచ్చాయి. ఇటీవల కేరళలోని వయనాడ్‌లోనూ అదే పరిస్థితి. ఒక్క మన దేశంలోనే కాదు. విదేశాల్లోనూ అంతే. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాలో వచ్చిన వరదలు వందల మంది ప్రాణాల్ని తీశాయి. వేల కోట్ల ఆస్తుల నష్టానికి కారణం అయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితి స్పెయిన్‌కు వచ్చింది.
హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు మూడు, నాలుగు కార్లు కొట్టుకోవడాన్ని చూసి బాబోయ్ అనుకుంటాం. కానీ స్పెయిన్‌లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్‌లో కొన్ని వేల కార్లు కొట్టుకుపోయి ఓ కుప్పలా పేరుకుపోయాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఐదు, ఆరు అంతస్తుల్లోనూ ఎవరూ సేఫ్‌గా ఉండలేకపోయారు. ఎందుకంటే అంత ఎత్తులో కొన్ని చోట్ల నీళ్లు పారాయి మరి. [
స్పెయిన్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యంత ఘోరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కొంత మంది నిపుణులు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన ప్రాంతాల్లో బిఫోర్, ఆఫ్టర్ శాటిలైట్ వీడియోను చూపారు. ఎంత డిస్ట్రక్షన్ జరిగిదో వాటిని చూస్తే అర్థమైపోతుంది.