Meet 35 year old who built Rs 83 000 crore firm in less than 2 year: టాలెంట్, క్రియేటివిటీ టెక్ ప్రపంచ  అవసరాలకు తగ్గ ఐడియాలతో వస్తే ప్రపంచ కుబేరులు అవడానికి ఎంతో సమయం  పట్టదు. మైక్రోసాఫ్ట్ నుంచి ఎంతో మంది కుబేరులు టెక్ ప్రపంచం నుంచి వచ్చారు. ఇలాగే భవిష్యత్‌ను శాసిస్తాడని అందరూ అనుకుంటున్న పేరు నిఖిల్ విశ్వనాథన్. ఆయన ఆల్కెమీ అనే కంపెనీకి కో ఫౌండర్. ఈ కంపెనీ ప్రారంభించిన రెండు అంటే రెండేళ్లలో 83 వేల కోట్ల విలువైన కంపెనీగా మారింది. మైక్రోసాఫ్ట్ ఫర్ బ్లాక్ చెయిన్ అనే బిరుదును కూడా ఈ కంపెనీ తెచ్చుకుంది.  


2021లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ గురించి టెక్ ప్రపంచంలో చర్చ ప్రారంభమమయింది. అప్పుడే తన  సహచరులతో కలిసి నిఖిల్ విశ్వనాథన్  అల్కెమీ అనే కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ బ్లాకచెయిన్ బేస్డ్ కంపెనీలకు సేవలకు అందిస్తుంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అంటే అందరికి ఇప్పుడు అల్కెమీనే గుర్తుకు వస్తుంది. అందుకే రెండేళ్లలోనే ఈ కంపెనీ  వాల్యూ ఊహించనంతగా పెరిగిపోయింది. పది బిలియన్ డాలర్ల కు శరవేగంగా చేరుకుంది. ఈ కంపెనీలో నిఖిల్ విశ్వనాథన్‌కు ఇరవై ఆరు శాతం పార్టనర్ షిప్ ఉంది. అందుకే ఆయన నెట్ వర్త్ పదిహేను వేల కోట్లుకుపైగా ఉంటుంది. అమెరికాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన భారత సంతతిటెకీగా నిఖిల్ విశ్వనాథన్ గుర్తింపు తెచ్చుకున్నారు. 


లక్నోలో అడుక్కునేవాళ్ల సంపాదన ఒక్కొక్కరికి లక్ష పైనే - ఐ ఫోన్లూ వాడతారు తెలుసా!


తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే జన్మించిన నిఖిల్ విశ్వనాథన్ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేశారు. ఆయన ప్రతిభను మెచ్చి ఫేస్ బుక్, గూగుల్ మాతృ  సంస్థల్లో ఇంటెర్నీగా అవకాశం ఇచ్చాయి. చదువు పూర్తియన తరవాత ఎక్కడా ఉద్యోగం కోసం చూడలేదు నిఖిల్ విశ్వనాథన్. స్వయంగా టెక్ స్టార్టప్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదటగా ఆయన ఓ  సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ను రూపొందించారు. ఆ యాప్ ఐ ఫోన్లలో అత్యధిక డౌన్ లోడ్స్ తో రికార్డు సృష్టించింది. అలాగే నిఖిల్ విశ్వనాథన్ విమానాశ్రయాల్లో డిజిటల్ చెక్ ఇన్ అయ్యే యాప్ కూడా  సిద్ధం చేశారు.


దేశ విభజన సమయంలో తప్పిపోయాడు - 77 ఏళ్ల తర్వాత కుటుంబం దగ్గరకు - చోటాసింగ్ లైఫ్ సినిమా స్టోరీనే


చెక్ ఇన్ టు మై ఫ్లైట్ అనే యాప్ ద్వారా ఆటోమేటిక్ చెక్ ఇన్ అయ్యే అవకాశాలను ఈ యాప్ అందిస్తుంది. దీన్ని  సౌత్వెస్ట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్స్‌లో  వినియోగించారు. అది ఆ ఎయిర్ లైన్స్‌కు సమస్యలు రావడంతో మూతపడింది. ఆ తర్వాత  బ్లాక్ చెయిన్ రంగంలోకి అడుగుపెట్టి అల్కెమీ స్థాపించారు. 37 ఏళ్ల నిఖిల్ విశ్వనాథన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకే ఆయనను అమెరికా టెక్ ప్రపంచంలో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా చెబుతూ ఉంటారు.