Lucknow professional beggars  Earning more than salaried workers: సిటీల్లో ట్రాఫిక్ సిగ్నల్ పడితే  కుంటుకుంటూ ఒకరు వచ్చి చేయి చాస్తారు. చంకలో బిడ్డనెత్తుకుని మరో మహిళ వచ్చి చేయి చాస్తారు. ఓ వృద్ధుడు నడవలేక నడుస్తూ వచ్చి.. రూపాయి కూడా చేయని పెన్ను ఇరవై రూపాయలకు అమ్మే ప్రయత్నం చేస్తారు. అడుక్కోకుండా కష్టపడుతున్నానని నమ్మించే ప్రయత్నం అది. అలాంటివి అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. జాలి గుండె ఉన్న వాళ్లు ఎంతో కొంత దానం చేస్తూంటారు. అలాంటి వాళ్లు లక్నోలో కాస్త ఎక్కువే ఉన్నారు. ఎందుకంటే ఆ సిటీలో బిచ్చగాళ్లకు నెలకు రూ. లక్ష వరకూ ఇచ్చి పోషిస్తున్నారు.    


నవాబ్‌ల సిటీగా పేరు పొందిన లక్నోలో బిచ్చగాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటారు.  దేశం ఇంత అభివృద్ది చెందుతున్నా..  ప్రభుత్వాలు ఎన్నో  సంక్షేమ పథకాలు అమలు  చేస్తున్నా వీరంతా ఎందుకు బిచ్చగాళ్లుగా ఉన్నారని ఓ స్వచ్చంద సంస్థ సర్వే చేసింది. వారి స్థితి గతుల్ని  పరిశీలించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే..  బిచ్చమెత్తుకుంటున్న వారిలో 90  శాతం మంది పేదవాళ్లు కాదు. వారికి ఒక్కొక్కరికి రూ. లక్ష వరకూ నెలకు ఆదాయం వస్తోంది. వారి కుటుంబాల్లో చాలా మంది ఐ ఫోన్లు వాడుతున్నారు. ల్యాప్ ట్యాప్‌లు, పాన్ కార్డులు కూడా ఉన్నాయి. ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత ఆ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. 


దేశ విభజన సమయంలో తప్పిపోయాడు - 77 ఏళ్ల తర్వాత కుటుంబం దగ్గరకు - చోటాసింగ్ లైఫ్ సినిమా స్టోరీనే


లక్నో వాసులు సగటున రోజుకు రూ. అరవై మూడు లక్షల రూపాయలు బిచ్చగాళ్లకు దానం చేస్తున్నారు. మొత్తంగా ప్రోఫెషనల్ బిచ్చగాళ్లు 5312 మంది ఉన్నట్లుగా ఎన్జీవో గుర్తించింది. లక్నో దుకాణాదారులు కూడా బిచ్చగాళ్లు ఓ మాఫియాలా తయారయ్యారని.. డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒకటి చిల్లర దొంగతనం కూడా చేయడానికి వెనుకాడరని అంటున్నారు. ఈ బిచ్చగాళ్లు అన్ని చోట్లా లాగానే అక్కడ కూడా విభిన్నమైన వేషాలు వేస్తున్నారని గుర్తించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, నెలలు కూడా నిండని పిల్లలను తీసుకుని వారు భిక్షాటన చేస్తున్నారు. 


రష్యాతో పెట్టుకుంటే అంతే - గూగుల్‌కు ప్రపంచంలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా !


లక్నోలో ఉన్న బిచ్చగాళ్లలో ఓ పది శాతం మంది మాత్రమే  అసలైన బిచ్చగాళ్లని మిగిలిన వారంతా ప్రోపెషనల్స్ బెగ్గర్స్ అని గుర్తించారు. వారందర్నీ ఎలాగోలా బెగ్గింగ్ మార్పించాలని ఆ స్వచ్చంద సంస్థ ప్రయత్నిస్తోంది. కానీ లక్ష సంపాదనను వారు ఎందుకు వదులుకుంటారు? .  మన సిటీల్లోనూ ఇలాంటి  బెగ్గర్స్ చాలా మంది ఉంటారు. వారిని ప్రోత్సహిస్తే వారు లక్షాధికారులు అవుతారు.. లేదా వారిని గుప్పిట్లో పెట్టుకున్న మాఫియా డబ్బు సంపాదించుకుంటుంది. అందుకే బిచ్చగాళ్లు ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా... అంతగా సాయం చేయాలనుకుంటే ఆకలి తీరిస్తే సరిపోతుందని ఎక్కువ మంది ఇచ్చే సలహా.