ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడంలో ఆ దేశ మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు పలు ఒప్పందాలపై సంతకం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. జీ7 దేశాలు ఈ విషయాన్ని ఖండించాయి. ఈ కాలంలో ఇతర దేశాల ప్రాంతాలను మీ దేశంలో విలీనండ చేయడం ఏంటని రష్యాను ప్రశ్నించాయి. ఈ క్రమంలో పుతిన్ ఉద్వేగభరింతంగా చేసిన ప్రసంగంలో కీలక విషయాలను ప్రస్తావించారు. పాశ్యాత్యదేశాలు మధ్య యుగాల్లోనే వలసవాద విధానాన్ని ప్రారంభించారని, భారతదేశాన్ని ఎన్నో విధాలుగా దోచుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బానిసలుగా చేసుకుని వ్యాపారం చేసిన పశ్చిమ దేశాలు.. అనంతరం అమెరికాలో భారతీయ తెగల మారణహోమం జరిగిందన్నారు పుతిన్. భారత్‌‌తో పాటు ఆఫ్రికా దేశాల్లో దోపిడీ జరిగిందని, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ దేశాలు చైనాకు వ్యతిరేకంగా యుద్ధాలు చేశాయన్నారు. ప్రస్తుతం రష్యాపై విమర్శలు చేస్తున్న పాశ్యాత్య దేశాలకు ఇవన్నీ గుర్తుకురాలేదా అంటూ అమెరికా, యూకేను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు పుతిన్.






రష్యా తమ భూభాగాలను ఆక్రమించడాన్ని వేగవంతం చేయడంతో ఉక్రెనియా అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటోలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉక్రెయిన్ పై ఆధిపత్యం కోసం చెలరేగుతున్న రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌ ప్రాంతాలు ఉక్రెయిన్‌ భూభాగంలో ఉన్నప్పటికీ మెజార్టీ ప్రజలు రష్యాలో ఉండేందుకే ఆసక్తి చూపించారు. దాంతో వీటిని స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించి, రష్యా అధికారికంగా వాటిని తన భూభాగంలో విలీనం చేసుకుంది. తద్వారా ఉక్రెయిన్‌లో 15% భూభాగం రష్యాలో కలిసినట్లయింది.


ఈ ప్రాంతాలను తమ దేశంలో కలుపుతూ సంతకాలు చేసిన కార్యక్రమంలో రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాలు... మధ్య యుగాలలో వలసవాద విధానాన్ని ప్రారంభించాయి, ఆపై బానిసలుగా మార్చి వ్యాపారం చేశారని, అమెరికాలో భారతీయ తెగలపై మారణహోమం జరిగిందని ఆరోపించారు. ఆఫ్రికాలో దోపిడీ జరిగిందని, చైనాకు వ్యతిరేకంగా ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ యుద్ధానికి దిగాయని తన ప్రసంగంలో పుతిన్ గుర్తుచేశారు.


జంతువుల్లాగ మనుషుల వేట !
మిగతా దేశాలను మాదకద్రవ్యాలతో కట్టిపడేయండంతో పాటు కొన్ని జాతి సమూహాలను నిర్మూలించేందుకు పాశ్యాత్య దేశాలు ప్రయత్నించాయన్నారు. వారికి కావాల్సిన భూమి కోసం, వనరుల కోసం, జంతువుల తరహాలో భారత్, ఆఫ్రికా లాంటి దేశాల ప్రజలను వేటాడారని.. ఇది వారి స్వేచ్ఛకు, న్యాయానికి విరుద్ధంగా జరిగాయంటూ పుతిన్ ఆవేశంగా ప్రసంగించారు.


పుతిన్ ఇంకా ఏమన్నారంటే.. 
క్రెమ్లిన్ నిర్వహించే ఓటింగ్ ను గౌరవించాలి కానీ, అమెరికా దాని మిత్రదేశాలు రష్యాను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పాశ్యాత్య దేశాలు (పశ్చిమ దేశాలు) ప్రపంచాన్ని మొత్తం దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని, దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోవియట్ తరహాలో గొప్ప శక్తిగా మళ్లీ ఎదిగేందుకు ప్రయత్నిస్తోందని, తద్వారా పశ్చిమ దేశాల ఆధిపత్యానికి చెక్ పెడతామని ధీమా వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. భవిష్యత్ తరాలు మన పూర్వ వైభవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.