Kabul Blast:
ఎడ్యుకేషన్ సెంటర్‌లో పేలుడు
అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఈ మధ్య కాలంలో బాంబు పేలుళ్ల ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుసగా ఏదో ఓ చోట ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కాబూల్‌లోని ఓ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో ఆత్మాహుతి దాడి జరగ్గా...100 మంది చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. స్థానిక జర్నలిస్ట్‌లు ఇస్తున్న సమాచారం ప్రకారం...హజారా, షియా వర్గాలకు చెందిన విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ బ్లాస్ట్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. అఫ్ఘనిస్థాన్‌లో హజారాలు మూడో అతి పెద్ద వర్గంగా ఉన్నారు. దస్త్ ఏ బర్చి ప్రాంతంలోని కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఈ పేలుడు సంభవించినట్టు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. "ఇప్పటి వరకూ 100 మంది చిన్నారుల మృత దేహాలు బయటపడ్డాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. తరగతి గదిలో చాలా మంది విద్యార్థులున్నారు. మాక్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది" అని లోకల్ జర్నలిస్ట్ ఒకరు ట్విటర్‌లో వెల్లడించారు. విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఈ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది.
గతంలోనూ పేలుళ్లు..
అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో గతంలోనూ భారీ పేలుడు సంభవించింది. రష్యా ఎంబసీ పరిసరాల్లో దరుల్ అమన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 20 మృతి చెందారు. అఫ్గానిస్థాన్‌లోని టోలో న్యూస్ ఈ ప్రాథమిక వివరాలు వెల్లడించింది. ఇటీవలే హెరట్ ప్రావినెన్స్‌లోనూ ఇదే తరహాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మసీదులో పేలుడు సంభవించగా...18 మంది మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. ఆ మసీదు ఇమామ్ మావల్వి ముజీబ్ రహమాన్ అన్సారీ ఈ పేలుడులో మృతి చెందినట్టు టోలో న్యూస్ వెల్లడించింది. మసీదులో ప్రార్థనలు చేసుకునే సమయంలో ఆత్మాహుతి దాడి జరిగినట్టు స్పష్టం చేసింది. ఈ మధ్య కాలంలో అఫ్గానిస్థాన్‌లో ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అంతకు ముందు కూడా అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఓ మసీదు వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోగా...40 మంది గాయపడ్డారు. సాయంత్రం ప్రార్థనలు చేసుకునే సమయంలో ఖాయిర్ ఖానాలో బాంబు పేలింది. "కాబూల్‌కు ఉత్తర ప్రాంతంలోని ఓ మసీదులో బాంబు పేలిన ఘటనలో 20 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు" అని అఫ్గాన్ సెక్యూరిటీ సోర్స్ వెల్లడించింది. తాలిబన్లు అఫ్గాన్‌ను వశం చేసుకుని ఏడాది కావస్తున్నా...సాధారణ పౌరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులనూ టార్గెట్ చేస్తూ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.
తాలిబన్ల పాలనకు ఏడాది
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనకు ఏడాది పూర్తైంది. ప్రజాస్వామ్యం నుంచి ఇస్లామిక్ వాదుల పాలనలోకి జారిపోయిన ఈ ఏడాది కాలంలో దేశం ఆర్థికంగా పతనమైంది. అంతర్జాతీయంగానూ ఒంటరిగా మిగిలింది. పరిపాలనాపరమైన ఎన్ని సవాళ్లు ఉన్నా పట్టని తాలిబన్లు... ఏడాది పాలనకు గుర్తుగా వీధుల్లో మోటారు వాహనాలపై తిరుగుతూ ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. అమెరికా రాయబార కార్యాలయం ఉన్నచోట కొందరు ‘డెత్ టు అమెరికా’అంటూ నినాదాలు చేశారు.అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ దేశం పరిస్థితి
అస్తవ్యస్తమైంది.
Also Read: Kerala Dog Attack: పిల్లి కరిచిందని ఆసుపత్రికి వెళ్లిన యువతిపై కుక్క దాడి!