టాటా మోటార్స్ భారతీయ ఈవీ రిజల్యూషన్‌లో పెద్ద మార్పును తీసుకువచ్చింది. గతంలో నెక్సాన్ ఈవీని 2020 జనవరిలో లాంచ్ చేసింది. ఆ తర్వాత 2021లో టిగోర్ ఈవీని తీసుకువచ్చింది. ఇప్పుడు మొదటిసారి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీని లాంచ్ చేసింది.


ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఈవీ టియాగోనే. దీని ధర మనదేశంలో రూ.8.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఈవీ ప్యాసింజర్ కారు ఇదే కానుంది. టియాగో రెగ్యులర్ వెర్షన్ ఆధారంగానే దీన్ని రూపొందించారు. అయితే ఎలక్ట్రిక్‌కు తగ్గట్లు దీనికి మార్పులు చేశారు. 


ఈ కారులో రెండు వెర్షన్లు ఉన్నాయి. వీటిలో 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 250 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇక 24 కేడబ్ల్యూహెచ్ మోడల్ అయితే 315 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించనుంది. బ్యాటరీ ప్యాక్‌కు 8 సంవత్సరాలు/1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని అందించనున్నారు. ఇక వాహనానికి 3 సంవత్సరాలు/1.25 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ లభించనుంది.


టియాగో ఈవీలో రెండు రకాల చార్జర్ ఆప్షన్లు ఉన్నాయి. 3.3 కిలో వాట్ కాంపాక్ట్ ఏసీ చార్జర్ ద్వారా కారు పూర్తిగా చార్జ్ కావడానికి మూడు గంటల 36 నిమిషాలు పట్టనుంది. అదే 7.2 కిలో వాట్ ఫాస్ట్ చార్జర్ ద్వారా అయితే కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కనుంది.


ఇందులో 8 స్పీకర్ల హర్మాన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం అందించారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను ఇది సపోర్ట్ చేయనుంది. లెదర్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ట్రైన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో ఫోల్డ్ ఉన్న ఎలక్ట్రిక్ ఓవీఆర్ఎమ్స్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందించనున్నారు. దీనికి సంబంధించిన డెలివరీలు 2023 జనవరిలో ప్రారంభం కానున్నాయి.


టాటా టియాగో ఈవీ ధర
టియాగో ఈవీ 19.2 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్ఈ వేరియంట్ - రూ.8.49 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 19.2 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌టీ వేరియంట్ - రూ.9.09 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌టీ వేరియంట్ - రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌జెడ్+ వేరియంట్ - రూ.10.79 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 3.3 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌జెడ్+ టెక్ లక్స్ వేరియంట్ - రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 7.2 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌జెడ్+ వేరియంట్ - రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూం)
టియాగో ఈవీ 24 కేడబ్ల్యూహెచ్ - 7.2 కేడబ్ల్యూ ఏసీ - ఎక్స్‌జెడ్+ టెక్ లక్స్ వేరియంట్ - రూ.11.79 లక్షలు (ఎక్స్-షోరూం)


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?