Bigg Boss 6 telugu: ప్రతి సీజన్లో కొందరి కంటెస్టెంట్ల మధ్య గొడవలు చాలా హైలైట్ అవుతాయి. ఈ మధ్య బాగా హైలైట్ అయిన జంట ఇనయా - శ్రీహాన్. వీరిద్దరూ ఒకరికొకరు అవకాశం వచ్చినప్పుడల్లా తిట్టుకుంటూనే ఉంటారు. ఇనయా ఏ విషయాన్నయినా సాగదీస్తూనే ఉంటుంది. శ్రీహాన్ ఆమెను వెటకారం చేస్తూనే ఉంటాడు. శ్రీహాన్‌కు గీతూ సపోర్ట్ కూడా తోడై ఇనయాను బాగా ఏడిపించేవారు. అయినా ఇనయా ఒంటరి పోరాటం చేసేది. ఆమెకు అందుకే ఓట్లు భారీగా పడుతున్నాయి. 


ఇక ఈరోజు ప్రోమోలో శ్రీహాన్ కెమెరాల కోసం తనలో తానే మాట్లాడుకుంటూ కనిపించాడు. కాసేపు  ఫైమా రాజ్‌తో కలిసి కామెడీ పండించింది. తరువాత మళ్లీ కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఈసారి ఇనయా చేతికి దొరికింది గ్లవ్స్. దొరికితే వదులుతుందా? శ్రీహాన్ కు ఇచ్చిపడేసింది. అంతేకాదు ఇంట్లో అమ్మాయి కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. 






తరువాత శ్రీహాన్ పట్టుకున్నాడు గ్లవ్‌ని. ఆయన రోహిత్ ఫోటోపై పంచ్ ఇచ్చాడు. కారణం చెబుతూ ‘ఇందాక నేను వెళ్లిపోయాను, ఇప్పుడు మీరు వెళ్లిపోతే వాళ్లకి (మహిళలకు)ఈజీ అవుతుంది’ అని చెప్పాడు. ఇక అర్జున్ కళ్యాణ్ ఆరోహిపై తన పగ తీర్చుకున్నాడు. ఆమెను కెప్టెన్ కాకుండా పంచ్ ఇచ్చాడు. రాజ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట వినలేదని అన్నాడు. ఆరోహి ఎప్పటిలాగే అడ్డంగా వాదించింది. 


ఇంకా కెప్టెన్ రేసులో రేవంత్, కీర్తి, శ్రీ సత్య, ఆరోహి, సుదీప మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి. 



ఈ సారి నామినేషన్స్ లో ఎక్కువమందే ఉన్నారు. ఆదివారం కీర్తి, అర్జున్ కళ్యాణ్ నేరుగా నామినేట్ అయ్యారు. 
1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్


వీరిలో ఇనయా, రేవంత్, గీతూ ఎలిమినేట్ అయ్యే అవకాశం సున్నా. శ్రీ సత్యా ఈ వారం బాగా ఆడింది కాబట్టి ఆమె కూడా సేవ్ అవుతుంది. ఇక వీరిలో కీర్తి, వాసంతి, రాజశేఖర్, అర్జున్... వీరిలో ఎవరో ఒకరు ఈ వారం ఇంటికి వెళ్లే ఛాన్సు ఉన్నట్టు సమాచారం. ఇక వీరిలో చాలా వీక్ కంటెస్టెంట్లుగా కనిపిస్తున్నది కీర్తి, రాజశేఖర్. కీర్తి పెద్దగా ఆడటానికి ఇష్టం కూడా చూపించడం లేదు. ఆమెకు తెలుగు సరిగా రాకపోవడం కూడా మైనస్ గా మారింది. వాసంతి కూడా కామ్ గోయింగ్ గర్ల్ కావడం వల్ల ఫ్యాన్స్ తక్కువగా ఉన్నారు.


Also read: రేవంత్‌కి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన బిగ్‌బాస్, ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చేలా


Also read: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది