Bigg Boss 6 telugu: బిగ్ బాస్‌లో ఏదైనా జరగొచ్చు. ఒక మనిషిని పాజిటివ్‌గా చూపించాలన్నా, నెగిటివ్‌గా ప్రొజెక్టు చేయాలన్న బిగ్ బాస్ చేతుల్లోనే ఉంది. రేవంత్ ఇంతవరకు కాస్త నెగిటివిటీని సంపాదించుకున్నాడు. గురువారం నాటి ఎపిసోడ్‌తో ఆ నెగిటివిటీ చాలా వరకు పోయే ఉంటుంది. ఆయనకు ఆయన భార్యకు జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు బిగ్‌బాస్.
సీమంతం వేడుక
రేవంత్ భార్య అన్విత నిండు గర్భిణీ. ఆమెకు గత వారం సీమంతం వేడుక అయ్యింది. ఆ వీడియోను రేవంత్ కోసం ప్లే చేశారు బిగ్ బాస్. అది చూసి రేవంత్ కళ్ల వెంట నీరు వస్తూనే ఉంది. చూసే వాళ్లకి కూడా కంటతడి పెట్టించేలా ఉంది. స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ వంటివి అక్కడ పెట్టి అందులో ఏవి తన భార్యకు పంపించాలో వాటిని ట్రేలో పెట్టి ఇవ్వమని చెప్పాడు బిగ్ బాస్. రేవంత్ టీవీలోని తన భార్య ఫోటోకు గంధం రాసి,బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. తన భార్య ఆరోగ్యంగా ఉందని అది చాలని అన్నాడు రేవంత్. ఈ సీన్ మొత్తం హౌస్లో ఎమోషన్‌ను నింపింది. బాలాదిత్య, రోహిత్ కళ్లనీరు పెట్టుకున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్‌తో ప్రేక్షకుల్లో రేవంత్ పై అభిప్రాయం మారిపోయి ఉండొచ్చు.
కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు
ఆ తరువాత కెప్టెన్సీ టాస్కు మొదలైంది. ఇందులో భాగంగా టాస్కు నుంచి అవుటైన వారు మిగతా వారిలో ఎవరు కెప్టెన్ కాకూడదో నిర్ణయిస్తారు. అలా గేమ్ నుంచి అవుటైన వారు రేవంత్, చంటి, ఇనయా, ఆదిరెడ్డి, సూర్య, బాలాదిత్య ఉన్నారు.కెప్టెన్సీ పోటీలో ఉన్న వారి ఫోటోలు అక్కడ పెట్టారు. అవులైన వాళ్లంతా బెల్ మోగగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గ్లవ్స్ ను తీసుకోవాలి. తమకు నచ్చని వ్యక్తిని కెప్టెన్సీ పోటీ నుంచి తొలగించవచ్చు. మొదట రేవంత్ గ్లవ్స్ దక్కించుకుని రాజశేఖర్ ను కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు. సూర్య వాసంతిని, ఆదిరెడ్డి అర్జున్ కళ్యాణ్‌ను, బాలాదిత్య ఫైమాను అవుట్ చేశారు.
చంటి వర్సెస్ గీతూ
ఇక చంటి గ్లవ్స్ దక్కించుకుని గీతూని టార్గెట్ చేశాడు. ఆమె ఫోటోపై పంచ్ ఇచ్చాడు. గీతూ చంటిని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ తనకు నోటి దూల అని నిరూపించుకుంది. అందరితో స్నేహంగా ఉండే వ్యక్తే కెప్టెన్ కావాలని, ఆమె అలా ఉండదని అన్నాడు. దానికి గీతూ ‘ఆడడం రాని వ్యక్తి నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉంది’ అంటూ గొడవకు తెరతీసింది. ముందు రిక్వెస్టుగా మాట్లాడి వెనుక వాళ్ల గురించి మాట్లాడడం నాకు చేతకాదు అంటూ గీతూ కొత్త పాయింట్లు తీసింది. కాసేపు వీరిద్దరూ వాదించుకున్నారు. గీతూ అయితే నోటికి పనిచెబుతూనే ఉంది.
గీతూ గలీజు గేమ్
గీతూ చాలా చీప్‌గా ప్రవర్తించినట్టు అనిపించింది. చంటి తనను కెప్టెన్ కాకుండా అడ్డుకోవడంతో రేవంత్‌ను చంటిపై రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. నీ ముందు అలా మాట్లాడి, వెనుక ఇలా కామెంట్లు చేశాడు అంటూ పాత విషయాలు చెప్పుకొచ్చింది.ఆమె తన పగ తీర్చుకోవడం కోసం చెప్పిన విషయాలను రేవంత్ శ్రద్ధగా వినడం విచిత్రంగా అనిపించింది.
Also read: పంచ్ పడింది, మళ్లీ గీతూ నోటికి పనిచెప్పింది, ఈసారి కెప్టెన్సీ కంటెండర్ల పోటీ అదిరిపోయింది