Bigg Boss 6 Telugu Episode 25: పూల్‌లో ఆ పనిచేసిన శ్రీహాన్? ఛీ కొట్టిన కంటెస్టెంట్లు, బాత్రూమ్ దగ్గరే కాపలా కాసిన రేవంత్

Bigg Boss 6 Telugu: బీబీ హోటల్ టాస్కులో ఎందుకో కానీ పెద్దగా ఆడినట్టు ఎవరూ కనిపించలేదు.

Continues below advertisement

Bigg Boss 6 Telugu: హోటల్ వర్సెస్ హోటల్ టాస్కులో ఇంట్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ టాస్కు చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్‌గా నడిచింది. రెండో రోజు మాత్రం గొడవలు, వాగ్వాదాలు సాగాయి. కానీ ఎవరూ కూడా అద్భుతంగా ఆడినట్టు కనిపించలేదు. కాస్త శ్రీ సత్యనే బెటర్ అనిపించింది. తన వరకు తాను గ్రూపుతో పాటూ ఆడి, మళ్లీ ఇండివిడ్యువల్‌గా కూడా ఆడింది. ఇక అర్జున్ ఆమె వెనుక తిరుగుతూ డబ్బుల వెదజల్లుతూనే ఉన్నాడు. 

Continues below advertisement

ఇక 25వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. డీలింగ్స్ విషయంలో సుదీప - ఫైమాల మధ్య ఫైట్ నడిచింది. బాత్రూమ్ యాక్సెస్ కొందరికి ఇవ్వడం ఫైమా చేసిన తప్పు. అదే విషయంపై కాసేపు వాగ్వాదం జరిగాక వాతావరణ చల్లబడింది. ఆ సమయంలో బాత్రూమ్ లోకి ఎవరూ వెళ్లకుండా రేవంత్ కాపలా ఉన్నాడు. అది చూసి రోహిత్, ఆదిరెడ్డి నవ్వుకున్నారు. వాళ్లలా నవ్వుకోవడం చూసి ‘నవ్వండి బ్రో... బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ నేను ఇలా పట్టుకున్నప్పుడు మీ నవ్వులు ఏమవుతాయో చూస్తా’ అంటూ తనలో తానే అనుకున్నాడు. 

కోప్పడిన బాలాదిత్య
ఎప్పుడూ ప్రవచనాలు చెప్పే బాలాదిత్య చిన్న విషయానికే ఈ రోజు రేవంత్ మీద కోపం చూపించాడు. భోజనం చేయడానికి వచ్చిన ‘రేవంత్ ఇంతేనా పప్పు ఉంది, ఇంతేనా కూర ఉంది’ అంటూ అనడంతో ఆయన విసిగిపోయాడు. ఈ విషయంలో రేవంత్ లేనప్పుడు ఇతరులతో మాట్లాడుతూ చిరాకు తెప్పించాడు. బీబీ హోటల్ టాస్కు సమయం ముగిసినట్టు చెప్పి లైట్లు ఆపేశారు బిగ్ బాస్. అయినా మనవాళ్లు ఆట మాత్రం ఆపలేదు. రాత్రి పూట ఎవరు బాత్రూమ్ కు వెళ్లిన అయిదు వందల రూపాయలు చెల్లించే వెళ్లాలని చెప్పింది సుదీప. అదే దొంగతనంగా వెళితే వెయ్యి రూపాయల ఫైన్ అంది. దానికి అందరూ ఓకే చెప్పారు. 

శ్రీహాన్ పాడుపని?
బాత్రూమ్‌కు అయిదు వందల రూపాయలు అడగడంతో శ్రీహాన్ ఓ పాడుపని చేసినట్టు కంటెస్టెంట్లు అనుమానిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో పూల్ దిగుతున్నా అంటూ దిగి కాసేపు ఉండి బయటికి వచ్చేశాడు. దీంతో ఇనయా శ్రీహాన్ చేసిన పని బాలేదని అంది. రేవంత్ నువ్వు పూల్ లో దిగి ఏం చేశావ్ అని అడిగాడు. శ్రీహాన్ మాత్రం తాను చేసిన పని ఎవరికీ చెప్పలేదు. 

ఆ ఇద్దరూ అవుట్
బిగ్‌బాస్ ఏ హోటల్ వాళ్లు ఎంత సంపాదించారో అడిగారు. గ్లామ్ ప్యారడైజ్ మేనేజర్ ఫైమా అయిదు వేల నాలుగు వందల రూపాయలతో పైచేయి సాధించింది. దీంతో బీబీ హోటల్ పై కూడా ఆధిపత్యాన్ని తీసుకోవచ్చని చెప్పాడు బిగ్ బాస్. అంతేకాదు బీబీ హోటల్ స్టాఫ్ నుంచి ఇద్దరినీ ఉద్యోగంలోంచి తీసేసి కెప్టెన్సీ కంటెండర్ కాకుండా చేయవచ్చని, ముగ్గురినీ తమ హోటల్ ఉద్యోగులుగా మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. అలాగే చంటికి ఇచ్చిన సీక్రెట్ టాస్కు ఆయన పూర్తి చేయనందున కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేరని చెప్పారు. దీంతో ఫైమా రేవంత్, బాలాదిత్యను తీసేస్తున్నట్టు చెప్పింది. 

Also read: బీబీ హోటల్‌లో గొడవలు మొదలు, బాత్రూమ్‌లు వాడడానికి వీల్లేదు

Also read: మరో షన్ను - సిరిలా మారిన సూర్య -ఆరోహి, ఇంట్లో బీబీ హోటల్ గేమ్, చంటికి సీక్రెట్ టాస్కు

Continues below advertisement
Sponsored Links by Taboola