Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో హోటల్ టాస్కు చాలా ఫన్నీగా జోరుగా సాగింది. ప్రేక్షకులను బాగానే అలరించారు హోటల్ సిబ్బంది, గెస్టులు. అయితే ఈనాటి ఎపిసోడ్లో టాస్కు ముగిసే సమయం వచ్చేసినట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఈ సమయంలో మళ్లీ ఇంటి సభ్యుల మధ్య గొడవలు మొదలైనట్టు ప్రోమోలో కనిపిస్తుంది. చివరికి సుదీప కంటినీరు పెట్టుకుని కనిపించింది. ఆమె ఎవరి వల్ల హర్ట్ అయ్యిందో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి.
ప్రోమోలో ఏముందంటే...సూర్య మతిమరుపు గెస్టు పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా అతను ఈసారి గజినీలా తయారయ్యాడు. ఒంటినిండా పేర్లు రాసుకున్నాడు. శ్రీ సత్య కూడా వచ్చి తన పేరు రాసి వెళ్లిపోయింది. మధ్యలో ఫైమా వచ్చి ‘ముఖం చూడు ముఖం ఏబ్రాసి ముఖం’ అంటూ కామెడీ చేసింది. తరువాత బిగ్ బాస్ ఏ హోటల్ సిబ్భంది ఎంత డబ్బు సంపాదించారో చెప్పమని అడిగారు. బీబీ హోటల్ మేనేజర్ సుదీప తమ దగ్గర నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉన్నట్టు చెప్పింది. ఇక గ్లామ్ ప్యారడైజ్ హొటల్ మేనేజర్ ఫైమా తమ దగ్గర అయిదు వేల నాలుగు వందల రూపాయలు ఉన్నట్టు చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
బీబీ హోటల్ స్టాఫ్ నుంచి ఇద్దరిని కెప్టెన్సీ కంటెండర్ అయ్యే రేసు నుంచి తొలగించాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఫైమా రేవంత్, ఆదిత్య పేరు చెప్పింది. ఇది ఇంకా షాకిచ్చింది ఇంటి సభ్యులకు. ఇక రేవంత్, ఆదిత్య ముఖాలైతే మాడిపోయాయి.
రెండో లెవెల్
హోటల్ వర్సెస్ హోటల్ టాస్కు రెండో లెవెల్ కు చేరుకుంది. ఇందులో బీబీ హోటల్, గ్లామ్ ప్యారడైజ్ స్టాఫ్ లో కొంతమంది కలిసి మాట్లాడుకుంటున్నారు. శ్రీ సత్య నేను కూడా రావచ్చా అనగానే, సుదీప ‘ప్లీజ్ ఏమనుకోకు టూ మినిట్స్ ఉండు’ అంది. దీంతో శ్రీ సత్యకు చాలా కోపం వచ్చేసింది. తాను సోలో ఆట ఆడుతున్నానని, ఎవరికైనా డీల్ కావాలంటే తన దగ్గరికి రావచ్చని అంది. ఆదిరెడ్డి ఇంట్లో ఫుడ్ దగ్గర బేరాలాడుతూ కనిపించాడు.
బిగ్ బాస్ హోటల్ టాస్కు మరికాసేపట్లో ముగిసిపోతుందని ప్రకటించాడు. దీంతో అందరూ డబ్బులు లెక్కపెడుతూ కనిపించారు. ఈ విషయంలో ఆరోహికి, సుదీప, గీతూ మధ్య ఇదే విషయంలో చర్చలు జరిగాయి. చివరికి ఏమైందో కానీ సుదీప కన్నీటితో ప్రోమో ముగిసింది.
Also read: మరో షన్ను - సిరిలా మారిన సూర్య -ఆరోహి, ఇంట్లో బీబీ హోటల్ గేమ్, చంటికి సీక్రెట్ టాస్కు