Bigg Boss 6 Telugu: ఈనాటి ప్రోమోను చూస్తుంటే ఎవరికైనా నామినేషన్ రోజులు గుర్తుకు రావడం ఖాయం. కెప్టెన్సీ కంటెండర్లు కాకుండా పక్కవారిని అడ్డుకునే బాధ్యత ఇంటి సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో నామినేషన్ వేసిన రేంజ్‌లో ఇంటి సభ్యులు రెచ్చిపోయి ఆడారు. ఇక గీతూ - చంటి మధ్య షరా మామూలుగానే మాటల యుద్ధం సాగింది.
ప్రోమోలో ఏముందంటే... మొదట మెరీనా - రోహిత్ కాస్త వాదించుకుంటూ కనిపించారు. ఆ తరువాత కెప్టెన్సీ కంటెండర్ల టాస్కును ఇచ్చాడు బిగ్‌బాస్.బీబీ హోటల్ టాస్కులో బాగా ఆడిన వారి ఫోటోలను అక్కడ పెట్టారు. దాని ఎదురుగా బాక్సింగ్ గ్లవ్ పెట్టారు. టాస్కు నుంచి బయటికి వచ్చిన వారంతా బెల్ మోగినప్పుడల్లా బాక్సింగ్ గ్లవ్ దక్కించుకోవాలి. దాంతో అక్కడ ఉన్న ఫోటోలో ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ కాకూడదు అనుకుంటున్నారో వారి ఫోటోపై పంచ్ ఇవ్వాలి.
అలా ఆదిరెడ్డి గ్లవ్స్ దక్కించుకుని అర్జున్ కళ్యాణ్ ఫోటోపై పంచ్ ఇచ్చాడు. కెప్టెన్సీకి తక్కువ డిజర్వ్‌డ్ అనిపిస్తోందని కారణం చెప్పాడు.ఇక రేవంత్ రాజశేఖర్ ఫోటోపై పంచ్ ఇచ్చాడు. ఆల్రెడీ రాజ్ కెప్టెన్ అయ్యాడని అందుకే పంచ్ ఇచ్చినట్టు చెప్పాడు. సూర్య గ్లవ్‌తో వాసంతి ఫోటోపై పంచ్ ఇచ్చాడు. ఇక చంటి గీతూ ఫోటో పై పంచ్ ఇచ్చాడు. దీంతో గీతూ మళ్లీ నోటికి పనిచెప్పింది.
నోటిదూల అంటే ఇదే
గీతూ నోటిదూల అంటే ఒప్పుకోదు కానీ నాగార్జునే తేల్చారు ఆమెకే నోటిదూల అని. చంటి గీతూ ఫోటోపై పంచ్ కొట్టాక ‘కెప్టెన్ అంటే అందరితో స్నేహంగా ఉంటూ, పనులను షేర్ చేయాలి, అది తనలో కొంచెం లేదు అని నా ఉద్దేశం’ అన్నాడు. దానికి గీతూ ‘గేమ్ ఆడడం రానోళ్లు నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉంది’ అంటూ వెటకారంగా అక్కడ్నించి వెళ్లిపోయింది. దీంతో చంటికి కోపం వచ్చింది. దీన్నే పోక్ చేయడం అంటారు అన్నాడు.
గీతూ ఇంకా వెనక్కి తగ్గకుండా గేమ్ ఆడడం రానోళ్లే మీరు అంటూ మళ్లీ మళ్లీ రెచ్చగొట్టింది. చంటి కూడా వెనక్కి తగ్గకుండా ‘నీకు తెలిసిందే చెటాకు, అది నువ్వు గేమ్ అనుకుంటున్నావ్’ అంటూ మర్యాదగానే ఇచ్చిపడేశాడు.
గీతూ ‘నన్ను ఎవడు ఏం చేయలేడు’ అంటూ ఓవర్ యాక్షన్ చేసింది. చంటికి గీతూ ప్రవర్తన మాత్రం చాలా చిరాకు తెప్పించింది. చూసే ప్రేక్షకులకు కూడా అలాగే అనిపించి ఉండొచ్చు.
Also read: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్
Also read: పూల్‌లో ఆ పనిచేసిన శ్రీహాన్? ఛీ కొట్టిన కంటెస్టెంట్లు, బాత్రూమ్ దగ్గరే కాపలా కాసిన రేవంత్