Kerala Dog Attack: పిల్లి కరిచిందని వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి అక్కడున్న కుక్క కాటుకు గురైంది. కేరళలో ఈ ఘటన జరిగింది


ఇదీ జరిగింది


తిరువనంతపురంలోని విళింజంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది. అపర్ణ (31) అనే యువతిని ఇటీవల పిల్లి కరిచింది. దీంతో సమీపంలోని ప్రజారోగ్య సంరక్షణ కేంద్రానికి యాంటి రేబిస్ డోస్ తీసుకునేందుకు తన తండ్రిని తీసుకుని వచ్చింది. అయితే ఆ పీహెచ్‌సీ ఆవరణలో ఉన్న ఓ కుక్క.. అపర్ణపై దాడి చేసి కరిచింది.


శుక్రవారం ఉదయం 8 గంటలకు వీరిద్దరూ హెల్త్ సెంటర్‌కు వచ్చారు. ఆ సమయంలో అపర్ణ అక్కడున్న కుర్చీలో కూర్చుంది. అయితే కుర్చీ కింద పడుకున్న ఓ కుక్క ఆమెను ఒక్కసారిగా కరిచింది. కుక్క దాడిలో గాయపడిన అపర్ణకు.. అక్కడున్న సిబ్బంది ప్రథమ చికిత్స చేయడంలో ఆలస్యం చేశారని ఆమె తండ్రి ఆరోపించారు.


దీంతో తన కూతురిని.. జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. విళింజం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించి చికిత్స అందించినట్లు ఆయన పేర్కొన్నారు. 


వైరల్


ఈ మధ్య ఎక్కడ చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. రోడ్డుపై నడిచి వెళ్లాలంటేనే భయమేస్తుంది. తాజాగా కేరళలో ఓ ఇద్దరు విద్యార్థులను వీధి కుక్కులు చేజ్ చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే కుక్కలు వెంటాడినట్లు లేదు వేటాడటానికి వస్తున్నట్లు ఉంది.






కన్నూర్ పట్టణంలో వీధి కుక్కల గుంపు రోడ్డుపై నడిచి వస్తున్న ఇద్దరు విద్యార్థులను కరిచేందుకు వెంటాడాయి. ఆ విద్యార్థులు రోడ్డుపై నడిచి వస్తుండగా వీధిలో ఉన్న కుక్కల గుంపు మొరుగుతూ విద్యార్థులపైకి వచ్చాయి. ఒకేసారి ఆరు కుక్కలు మీదకి రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.


తప్పించుకునేందుకు కుర్రాళ్లు పరుగు పెట్టడంతో కుక్కలు మరింత వేగంగా ఛేజింగ్ చేశాయి. అయితే అదృష్టవశాత్తు విద్యార్థులు పరుగులు తీసి వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి లోపలకు వెళ్లి గేటు వేశారు. 


దీంతో రెప్పపాటు కాలంలో కుక్కల దాడి నుంచి ఇద్దరు విద్యార్థులు తప్పించుకున్నారు. విద్యార్థులు గేటు లోపల ఉండటంతో బయట కుక్కలు మొరుగుతూ అక్కడే పాగా వేశాయి. దీంతో విద్యార్థులు ఆ ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడ్డారు.


Also Read: Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!


Also Read: Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు- ఆ మూడవ నేత ఎవరంటే?