రష్యాలో ఇప్పుడు కొరత ఉన్న వస్తువేది ? అంటే... అన్నీ దొరుకుతున్నాయని చెప్పుకోవచ్చు. రష్యా దిగుమతుల మీద ఆధారపడేది తక్కువే. అయితే నిత్యావసరాల వరకూ ఆ దేశానికి ఏ ఇబ్బంది లేదు. అయితే అక్కడి ప్రజలు ఇప్పుడు ఒకే విషయంలో ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. అదేమిటంటే కండోమ్స్ ( Condoms )  దొరకవేమో అని. రష్యలోని సూపర్‌ మార్కెట్లు, మెడికల్‌ స్టోర్లలో కండోమ్‌ల అమ్మకాలు భారీ స్థాయిలో సాగుతున్నాయి. గతేడాది మార్చితో పోల్చితే మొదటి పదిహేను రోజుల్లోనే రష్యాలో ( Russia ) కండోమ్‌ల అమ్మకాలు 170 శాతం పెరిగాయని డూరెక్స్‌ బ్రాండ్‌తో కండోమ్స్‌ తయారు చేసే రెకిట్‌ సంస్థ ప్రకటించింది.


మరో సోమాలియాలా శ్రీలంక ! ఆ దేశ పరిస్థితికి ఇవే కారణాలు


ప్రపంచదేశాల ఆంక్షలు విధించడం వల్ల దిగుమతలు తగ్గిపోతాయా అంటే.. అలాంటిదేమీ లేదని అక్కడి నిపుణులు చెబుతున్నారు. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలకు కండోమ్‌ తయారీ కంపెనీలు పెద్ద సంబంధం లేదు. రష్యాలో కూడా ఎక్కువగానే ఉత్పత్తి అవుతాయి. అయితే  కండోమ్‌ తయారీలో ఉపయోగించే లేటెక్స్‌ పదార్థాన్ని మాత్రం రష్యా దిగుమతి చేసుకుటుంది. అది దొరకదేమోనని ముందుగానే ప్రజలు భయపడుతున్నారు.   దీంతో కండోమ్‌లు దేశంలో లభించవేమోనన్న పుకారు బయల్దేరింది. ఫలితంగా రష్యన్లు భవిష్యత్తు అవసరాల కోసం అన్నట్టుగా వేలం వెర్రిగా మెడికల్‌ స్టోర్లు, సూపర్‌ మార్కెట్లలో కండోమ్‌ ప్యాకెట్లను కొనేస్తున్నారు.


గెలుస్తాం.. గెలిచి నిలబడతాం - ఉక్రెయిన్ పట్టుదల వీడియో రూపంలో !


రష్యా ప్రజలు సాధారణంగానే ఎక్కువగా కండోమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వారి రోజువారీ జీవితంలో ఓ భాగం కండోమ్స్ అనుకోవచ్చు. అవి లేకపోతే ఎలా అనే టెన్షనే ఇప్పుడు డిమాండ్ పెరడానికి కారణం అవతోంది. అందుకే ఆ దేశంలో కండోమ్‌ల కొరత ఏర్పడుతోంది. అక్కడి జనాలు అవసరానికి మించి గర్భనిరోధక సాధనమైన కండోమ్‌లు కొనుగోలు చేయడం వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండటం లేక కొరత ఏర్పడుతోంది. 


అప్పట్లో ఆ దేశానికి ఆర్థిక మంత్రి- ఇప్పుడు అమెరికాలో క్యాబ్ డ్రైవర్!


అక్కడి అధికారులు మాత్రం ఇలా ఇష్టారీతిని కొంటే.. డిమాండ్ అనూహ్యంగా పెరగడం వల్లనే  కొరత ఏర్పడుతుందని... అవసరాలకు తగ్గట్లుగా కొనుగోలు చేస్తే ఎలాంటి కొరత రాదని ప్రచారం చేస్తున్నారు. కానీ యుద్ధం కాబట్టి ప్రజలు ఎవరూ నమ్మడంలేదు. మందుగా కండోమ్స్ కొనుక్కుంటున్నారు.