ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. ఎన్ని రోజులు యుద్దం చేసినా.. మిస్సైళ్ల వర్షం కురిపించినా ఉక్రెయిన్ లొంగకపోతూండటంతో పుతిన్ అసహనానికి గురవుతున్నారు. కానీ ఉక్రెయిన్ మాత్రం ఎంత నష్టపోయినా రోజు రోజుకు కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తోంది. మేము గెలుస్తామంటూ ఓ స్ఫూర్తి దాయక  గీతాన్ని ఉక్రెయిన్ అధికారిక ట్విట్టర్‌లో పొందు పరిచారు. ఇప్పుడా పాట వైరల్ అవుతోంది. 
 





ఉక్రెయిన్‌కు ప్రపంచవ్యాప్తంగా సంఘిభావం లభిస్తోంది. ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిన పిల్లలకు పక్క దేశాల్లో విద్యార్థులు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. 


 





ఉక్రెయిన్‌లోకి వచ్చిన రష్యా సైనికులకు అక్కడి పౌరులు నిరసనల సెగ చూపిస్తూనే ఉన్నారు. చాలా చోట్ల రష్యా సైనికులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. 


 





కొన్ని చోట్ల బందీలుగా దొరికిన వారిని స్తంభాలకు కట్టేసి కొడుతున్నారు.