ఉక్రెయిన్- రష్యా యుద్ధం వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్యా, చైనాకు ఇదే సరైన సమయమని.. వారికి నచ్చినట్లు చేసుకోవచ్చన్నారు. జిన్‌పింగ్ త్వరలోనే తైవాన్‌పై యుద్ధం చేస్తారని జోస్యం చెప్పారు.
ఓ జీనియస్
అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ జీనియస్ అని ట్రంప్ అన్నారు. సరైన సమయం చూసి ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్నారన్నారు. ఉక్రెయిన్‌పై దండయాత్రకు పుతిన్ చేపడతోన్న చర్యలను జీనియస్ అని ట్రంప్ పేర్కొన్నారు. పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా తాను ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.
" పుతిన్ ఈ ప్రకటన చేసినప్పుడు నేను టీవీలో చూసి 'జీనియస్' చర్యగా పేర్కొన్నాను. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అద్భుతం. ఇది ఓ తెలివైన చర్య. వ్లాదిమిర్ పుతిన్ గురించి నాకు బాగా తెలుసు. కానీ ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే పుతిన్ ఇలా సాహసం చేసి ఉండేవారు కాదు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రస్తుత పరిస్థితులను బైడెన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. "