Russia Ukraine War: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులను నిర్బంధించారని రష్యా చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. తమ విద్యార్థులను ఉక్రెయిన్ బందీలుగా చేసినట్లు ఎక్కడా నివేదిక లేదని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బగ్చీ అన్నారు.
ఆపరేషన్ గంగా
మరోవైపు 'ఆపరేషన్ గంగా'లో భాగంగా మరో 3726 మంది భారతీయులు గురువారం స్వదేశానికి రానున్నట్లు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తరువాత భారత వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు హంగేరి, రొమేనియా నుంచి భారతీయులను తీసుకుని భారత్ చేరుకున్నాయి. మరో మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు పోలాండ్, హంగేరి, రొమేనియా నుంచి విద్యార్థులను తరలించనున్నాయి.