ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏఎన్-225 'మ్రియా' ధ్వంసమైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ తమ అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించింది. ఐదో రోజు యుద్ధంలో హోస్టోమెల్ విమానాశ్రయంపై రష్యా సేనలు బాంబులు విసిరాయి. దీంతో అక్కడే ఉన్న మ్రియా విమానం ధ్వంసమైంది.
ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద కార్గో విమానం. దీన్ని బాగు చేయడానికి దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు అవుతుందని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ విమానాన్ని 1980లో రూపొందించారు. ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత పొడవైన, బరువైన విమానంగా రికార్డ్ సృష్టించింది.
ఈ విమానం ఒక్కసారి 640 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. ఉక్రెయిన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ ఈ విమానాన్ని తయారు చేసింది.
ఉక్రెయిన్ పోరు
రష్యా సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో జెలెన్‌స్కీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ సరిహద్దులు దాటి లోపలికి వచ్చిన వందల మంది రష్యన్ సైనికులు హతమయ్యారని స్పష్టం చేశారు. శత్రు దురాక్రమణను ఉక్రెయిన్ వీరోచితంగా తిప్పికొడుతోందని ఆయన అన్నారు. రష్యా సేనలు వెను వెంటనే ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Ukraine-Russia War: ఉక్రెయిన్ అధ్యక్షుడే రష్యా టార్గెట్- జెలెన్‌స్కీని చంపేందుకు 400 మంది ఉగ్రవాదులు