యుద్ధం మొదలయ్యాక తొలిసారి రష్యా- ఉక్రెయిన్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చ జరిగే బెలారస్ సరిహద్దులోని ఉక్రెయిన్ భూభాగానికి ఇరు దేశాల ప్రతినిధులు చేరుకున్నారు. చర్చలకు ముందు ఇరు దేశాల కీలక వ్యాఖ్యలు చేశాయి.


ఉక్రెయిన్ డిమాండ్లు



  • రష్యా వెంటనే కాల్పుల విరమణను అమలు చేయాలి.

  • రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి రంపించాలి.


రష్యా డిమాండ్


చర్చ సందర్భంగా తమ అభ్యంతరాల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేసింది.


ఈయూ సాయం


మరోవైపు ఉక్రెయిన్‌కు అన్నిరకాలుగా అండగా ఉండేందుకు నాటో ముందుకొచ్చింది. ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు, ట్యాంక్ నిరోధక ఆయుధాల తరలింపు సహా మానవతావాద దృక్పథంతో, ఆర్థిక సాయం చేసి మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నాయని నాటో సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్​ అన్నారు.






ఉక్రెయిన్‌కు వెంటనే ఐరోపా సమాఖ్య (ఈయూ) సభ్యత్వం ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ కోరారు. 


5 రోజులుగా ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ సహా ఇతర నగరాలను అధీనంలోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. క్షిపణి ప్రయోగాలు, తుపాకీ తూటాలు, బాంబుల మోతతో ఉక్రెయిన్ మార్మోగుతోంది. దీంతో ఈ చర్చలు ఫలించి యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.


ఉక్రెయిన్ పోరు


రష్యా సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో జెలెన్‌స్కీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ సరిహద్దులు దాటి లోపలికి వచ్చిన వందల మంది రష్యన్‌ సైనికులు హతమయ్యారని స్పష్టం చేశారు. శత్రు దురాక్రమణను ఉక్రెయిన్‌ వీరోచితంగా తిప్పికొడుతోందని ఆయన అన్నారు. 


Also Read: Ukraine-Russia War: ఉక్రెయిన్ అధ్యక్షుడే రష్యా టార్గెట్- జెలెన్‌స్కీని చంపేందుకు 400 మంది ఉగ్రవాదులు


Also Read: Russia Ukraine War: మన ఆడపిల్లలపై ఉక్రెయిన్ సైనికుల వేధింపులు- కాలితో తన్ని నెట్టేస్తోన్న వీడియో వైరల్