ABP  WhatsApp

British Student in Ukraine: వీడెవడండి బాబు! మొన్న అఫ్గాన్, నేడు ఉక్రెయిన్- ఎక్కడికెళ్తే అక్కడ ఇరుక్కుపోతాడు!

ABP Desam Updated at: 02 Mar 2022 07:52 PM (IST)
Edited By: Murali Krishna

బ్రిటన్‌కు చెందిన ఓ కుర్రాడు.. ఎక్కడ యుద్ధం జరిగినా, ఘర్షణలు జరిగినా అక్కడికి వెళ్లిపోతున్నాడు. ఆ కుర్రాడ్ని అక్కడి నుంచి తప్పించడానికి బ్రిటన్ కష్టాలు పడుతోంది.

వీడెవడండి బాబు! మొన్న అఫ్గాన్, నేడు ఉక్రెయిన్

NEXT PREV

ఎక్కడ యుద్ధం జరిగినా, దాడులు జరిగినా.. అక్కడ ఆ కుర్రాడు ప్రత్యక్షమవుతాడు. మొన్న అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకునే సమయంలో బ్రిటన్‌కు చెందిన రౌత్‌లెడ్జ్‌ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోంటే మళ్లీ  ఇక్కడ కనిపించాడు. అసలు ఈ యుద్ధం జరిగే దేశాల్లో రౌత్‌లెడ్జ్ సాహసయాత్రలేంటో తెలుసుకుందాం రండి. 


దేనికైనా సిద్ధమే


రౌత్‌లెడ్జ్‌కు సాధారణంగా సాహసయాత్రలంటే ఇష్టం. దీంతో ఎక్కడ యుద్ధం, వివాదాలు, గొడవులు జరుగుతాయో అక్కడికి వెళ్లిపోతాడు. ఇలానే గత ఏడాది కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకునే కొద్ది రోజుల ముందు అఫ్గానిస్థాన్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి అతి కష్టం మీద బ్రిటన్.. రౌత్‌లెడ్జ్‌ను స్వదేశానికి తీసుకువచ్చింది. 






ఇప్పుడు మళ్లీ రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసే కొద్ది రోజుల ముందు ఫిబ్రవరి 25న ఆ దేశానికి వెళ్లిపోయాడు ఈ కుర్రాడు. పోలాండ్ నుంచి చివరి రైలులో ఈ కుర్రాడు ఉక్రెయిన్ వెళ్లాడు. ఆ సమయంలో అతని డాక్యుమెంట్లు కూడా అధికారులు సరిగా చెక్ చేయలేదన్నాడు.






ఇప్పుడు బాంబ్ షెల్టర్‌లో తలదాచుకుంటోన్న రౌత్‌లెడ్జ్.. ఈ యుద్ధంలో తన కాలు, చెయ్యి పోతుందేమోనని భయపడుతున్నాడు.




నన్ను ఉక్రెయిన్‌లోకి అనుమతించరేమో అనుకున్నాను. ఉక్రెయిన్ అధికారులు పురుషులను బలవంతంగా యుద్ధం చేయమంటారేమో అనిపిస్తోంది. ఇక్కడ కొన్ని చోట్ల కర్ఫ్యూ అమలులో ఉంది. వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. కానీ ఇక్కడి వాళ్లు నాకు ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. వీళ్లు చాలా మంచివాళ్లు.                                                               - రౌత్‌లెడ్జ్, యాత్రికుడు


Also Read: Russia Ukraine War: చల్లబడిన రష్యా సైనికులు- తిండి లేక, బండిలో ఇంధనం లేక, అంతా తికమక!


Also Read: Baba Vanga Prediction: పుతిన్ గురించి షాకింగ్ విషయాలు! రష్యాను ఎవరూ ఆపలేరా?: బాబా వాంగ కాలజ్ఞానం


Published at: 02 Mar 2022 07:52 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.