ABP  WhatsApp

Baba Vanga Prediction: పుతిన్ గురించి షాకింగ్ విషయాలు! రష్యాను ఎవరూ ఆపలేరా?: బాబా వాంగ కాలజ్ఞానం

ABP Desam Updated at: 02 Mar 2022 03:22 PM (IST)
Edited By: Murali Krishna

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుతిన్ గురించి షాకింగ్ విషయాలు! రష్యాను ఎవరూ ఆపలేరా?: బాబా వాంగ కాలజ్ఞానం

NEXT PREV

Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ప్రపంచాన్ని ఎదిరించి రష్యా నిలబడగలదా? యుద్ధం పూర్తయ్యే సరికి రష్యా ఆర్థిక స్థితి తలకిందులవుతుందా? రష్యాను అమేయ శక్తిగా పుతిన్ మారుస్తారా? ఇప్పుడు చాలామందిలో ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వీటన్నింటికీ ఓ కాలజ్ఞాని ఎప్పుడో సమాధానం చెప్పేశారట. అవును బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ కాలజ్ఞాన్ని బాబా వాంగ.. పుతిన్ గురించి ఎప్పుడో చెప్పారట. ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


టచ్ చేయలేరు


సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి సహా ఎన్నో విషయాలను ముందే ఊహించి చెప్పారు బాబాం వాంగ. ఆమె చెప్పిన వాటిలో 85 శాతం వరకు నిజమయ్యాయని చాలా మంది నమ్ముతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి కూడా ఆమె చెప్పారట.


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఏదో ఒకరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని వాలెంటిన్ సిదోరోవ్ అనే ఓ రచయితకు వాంగ చెప్పారట. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.



అన్నీ మంచులా కరిగిపోతాయి.. కానీ ఒక్కటి మాత్రం చెక్కుచెదరకుండా మిగిలిపోతుంది.. అదే పుతిన్ కీర్తి, రష్యా కీర్తి. రష్యాను ఎవరూ ఆపలేరు. మరోవైపు ఐరోపా ఎందుకు పనికిరాని ఖండంగా (wasteland) మారిపోతుంది.                                                                -  బాబా వాంగ


ఎలా చెప్పారు?


1911లో బల్గేరియాలో బాబా వాంగ పుట్టారు. 12 ఏళ్ల వయసులో ఓ తుపానులో కళ్లలో ఇసుక పడి ఆమె తన కంటిచూపును కోల్పోయారు. అప్పటి నుంచి భవిష్యత్తును ఊహించే శక్తి ఆమెకు వచ్చినట్లు చాలా మంది నమ్ముతారు.  


1996లో ఆమె చనిపోయారు. కానీ 5079 సంవత్సరం వరకు ఆమె కాలజ్ఞానం చెప్పారు. ఆ ఏడాది వరకే ఎందుకు చెప్పారంటే అక్కడితో ప్రపంచం అంతమైపోతుందని బాబా వాంగ అన్నారట. అయితే ఆమె చెప్పిన వాటిలో చాలా ఇప్పటికే నిజమయ్యాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, డయానా యువరాణి మృతి, 2004 థాయిలాండ్ సునామీ, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక.. ఇలా వాంగ చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి.


Also Read: Olena Zelenska: ఒలెనా పిరికిది కాదు దేశం విడిచి పారిపోవడానికి, భర్తకే కాదు దేశ ప్రజల్లోనూ ధైర్యం నింపగలదు


Also Read: Ukrania: ఉక్రెనియా యుద్ధంలో ఎంతో మంది ఆకలి తీరుస్తున్న భారతీయ రెస్టారెంట్ ‘సాథియా’, బంకర్లో ఉండడమే ఈ రెస్టారెంట్ అదృష్టం


 

Published at: 02 Mar 2022 03:19 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.