Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌-రష్యా(Ukraine-Russia) యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఒకసారి ఇరు దేశాల ప్రతినిధులు శాంతి చర్చలు జరిపారు. అవి అసంపూర్తిగా ముగిశాయి. ఇవాళ రెండో విడత శాంతి చర్చలను రెండు దేశాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా బెలారస్‌-పోలాండ్‌(Poland) సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. రష్యా విచక్షణారహిత దాడుల వల్ల ఉక్రెయిన్‌లో భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవిస్తుంది. శాంతి చర్చలు సఫలమై ఇరు దేశాలు యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. శాంతి చర్చలను నిషితంగా గమనిస్తున్నాయి. ఉక్రెయిన్‌ ప్రభుత్వం యుద్ధ పరిస్థితులను ముగించడంతోపాటు డాన్‌బాస్‌లో శాంతిని పునరుద్ధరిస్తుందని రష్యా విదేశీ వ్యవహారాల శాఖ(Russia MEA) ఓ ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌లోని ప్రజలందరూ శాంతియుత జీవనానికి వీలు కల్పిస్తుందని ఆశించింది. ఉక్రెయిన్‌ బృందంలోని సభ్యుడైన స్థానిక ప్రజాప్రతినిధి డేవిడ్ అరాఖమియా మీడియాతో మాట్లాడుతూ చర్చల్లో ఉక్రెయిన్‌లో మానవతా సహాయ చర్యల కోసం ‘హ్యూమానిటేరియన్‌ కారిడార్‌(Humanitarian Corridors)’లు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తామన్నారు. శాంతి చర్చలు(Peace Talks) జరిగినప్పటికీ దాడులను ఎట్టిపరిస్థితుల్లో ఆపబోమని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌ లో డిమిలిటరైజేషన్(Demillarization) లక్ష్యమని స్పష్టం చేసింది.






ప్రారంభమైన చర్చలు 


ఉక్రెయిన్‌లో సంక్షోభంపై రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండో రౌండ్ చర్చలు గురువారం బెలారస్‌లో ప్రారంభమైనట్లు బెలారస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్విట్టర్‌లో బెలారస్ విదేశాంగ శాఖ ఇలా పేర్కొంది. "రెండో రౌండ్ రష్యా-ఉక్రెయిన్ చర్చలు బెలారస్‌లో ప్రారంభమవుతాయి" స్పుత్నిక్ ప్రకారం, ఉక్రేనియన్ ప్రతినిధి బృందం పోలాండ్ నుంచి హెలికాప్టర్‌లో సమావేశ ప్రదేశానికి వెళ్లింది.
 సోమవారం మొదటి రౌండ్‌లో రష్యా ప్రతినిధి బృందం పార్లమెంటరీ స్థాయిలో ఉక్రెయిన్ నాన్-బ్లాక్ హోదా ప్రకటించాలని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని మాస్కో డిమాండ్‌గా తెలియజేసింది.


డినాజిఫికేషన్


మాస్కో డిమాండ్ ప్రకారం షరతులతో లుహాన్స్క్, దొనేత్సక్ ప్రాంతాల సరిహద్దుల్లోని లుహాన్స్క్, డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌(Republic)లను ఉక్రెయిన్ గుర్తించాలి. అలాగే ఉక్రెయిన్ 'డినాజిఫికేషన్' కూడా పాటించాలి. మొదటి చర్చల సమయంలో రష్యా ఉక్రెయిన్ కొన్ని ప్రాధాన్యతాంశాలను గుర్తించాయి. చర్చల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కార్యాలయం ఈ విషయాలను తెలిపింది. చర్చల తర్వాత రష్యా ప్రతినిధి బృందం హెడ్ మాట్లాడుతూ "సమస్యలను పరిష్కరించే విధాంగా చర్చలు ఉంటాయి" అని అన్నారు. రష్యా ప్రతినిధి బృందం, మొదటి చర్చలలో అధ్యక్ష సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ నేతృత్వం వహించారు. అంతకుముందు చర్చల్లో తక్షణ కాల్పుల విరమణ, ఉక్రెయిన్ భూభాగం నుండి దళాలను ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ పట్టుబట్టింది.  


రానున్న రోజుల్లో ఊహించని పరిస్థితులు


ఉక్రెయిన్‌పై చేపడుతున్న సైనిక చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) వెనక్కి తగ్గేలా లేరు. ఉక్రెయిన్‌ డిమిలిటరైజేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరతామని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌కు కూడా స్పష్టం చేసినట్లు క్రెమ్లిన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌ చర్చలను ఆలస్యం చేసే కొద్దీ డిమాండ్లు మరిన్నీ తెరమీదికి తీసుకొస్తామని పుతిన్ అన్నట్లు తెలుస్తోంది.  సైనిక చర్యను ఆపాలని ఫ్రాన్స్‌(France) అధ్యక్షుడు మేక్రాన్‌, రష్యా అధ్యక్షుడితో దాదాపు గంటకుపైగా ఫోన్‌లో మాట్లాడారు. అయినప్పటికీ పుతిన్‌ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడంలేదు. రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌లో ఊహించని పరిస్థితులు ఎదురుకావొచ్చనే భయాలు ఏర్పడుతున్నాయి.