Vladimir Putin Lover: వ్లాదిమిర్ పుతిన్.. ఎవరి మాట వినని ఓ పవర్‌ఫుల్ లీడర్. కానీ ప్రేమకు ఎవరూ అతీతులు కాదు అన్నది పుతిన్ విషయంలోనూ నిజమైంది. అవును.. ఉక్రెయిన్‌పై వెనక్కి తగ్గేదేలే అంటూ నరమేధం సృష్టిస్తోన్న పుతిన్ మనసులోనూ ఓ ప్రేమించే మనిషి ఉన్నాడు. మరి పుతిన్ ప్రేమకథ గురించి తెలుసుకుందామా?
మంచుకొండల్లో
ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతోన్న వేళ తన కుటుంబాన్ని సురక్షితంగా సైబీరియా ప్రాంతంలోని అట్లాయ్ పర్వతాల వద్ద నిర్మించిన అణుబంకర్లలో భద్రంగా దాచిపెట్టారు పుతిన్.
అయితే తన రహస్య ప్రియురాలు జిమ్నాస్ట్ అలీనా కబయేవాను పుతిన్ ఎక్కడ దాచిపెట్టారో తెలుసా? మంచుకొండలకు నిలయమైన స్విట్జర్లాండ్‌లో అలీనా కబయేవా, ఆమె నలుగురు పిల్లలను అత్యంత భద్రమైన ప్రాంతంలో దాచిపెట్టారట. మరి అంత భద్రంగా దాచిపెట్టిన పుతిన్ ప్రియురాలి గురించి ఈ విషయాలు తెలుసా?
పతకాల రారాణి
- అలీనా కబయేవా.. 1983లో పుట్టారు. మూడేళ్ల వయసులోనే రిథమిక్ జిమ్నాస్టిక్స్ సాధన ప్రారంభించారు.
- 15 ఏళ్ల వయసుకే ఐరోపా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు.
- అత్యంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన తొలి రష్యన్‌గా నిలిచారు.
- 1999 రెండోసారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ టైటిల్‌ను గెలుపొందారు.
- రెండు ఒలింపిక్ పతకాలు, 14 వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లు, 21 ఐరోపా ఛాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్నారు.
- డోపింగ్ ఆరోపణలతో రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్న అలీనా.. 2004లో రిటైర్మెంట్ ప్రకటించారు.
రష్యా రాజకీయం
- ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 2005లో పబ్లిక్ ఛాంబర్ ఆఫ్ రష్యా సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
- తర్వాత 2008లో పబ్లిక్ కౌన్సిల్ ఆఫ్ జాతీయ మీడియా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు.
- 2007, 2014లో దుమా రాష్ట్రం నుంచి యునైటెడ్ రష్యా పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు.
అక్కడే ప్రేమ
ఇలా రాజకీయంగా ఎదుగుతోన్న సమయంలో కబయేవాకు పుతిన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2008లోనే పుతిన్-కబయేవా బంధం గురించి వదంతులు వ్యాపించాయి. భార్యకు విడాకులిచ్చి కబయేవాను పెళ్లిచేసుకునే అలోచనలో పుతిన్ ఉన్నట్టు స్థానిక మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ పుతిన్ వీటిని ఖండించారు.
విడాకులు
2016లో పుతిన్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కబయేవాను పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కబయేవా వేలికి ఉంగరం ఉండటంతో పుతిన్ తనను పెళ్లి చేసుకున్నట్టు మళ్లీ మీడియా గుప్పుమంది. కానీ ఎప్పిటికప్పుడు పుతిన్ వీటిని ఖండిస్తూనే ఉన్నారు.
2004లో ఓ పోలీస్ అధికారితో కబయేవాకు నిశ్చితార్థం జరిగింది. అయితే ఏడాది తర్వాత 2005లో ఇద్దరూ విడిపోయారు. అయితే, పుతిన్, కబయేవాకు నలుగురు పిల్లలు ఉన్నారని ప్రచారం ఉంది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు స్విట్జర్లాండ్‌లో పుట్టారని, వీరికి స్విస్ పాస్‌పోర్ట్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్.. ఆమెను, పిల్లలను ఓ భద్రమైన ప్రాంతంలో దాచినట్లు సమాచారం.