ఆ బాక్స్ నిండా మనుషుల తలలు ఉన్నాయి. వాటిని చాలా భద్రంగా ట్రక్కులోకి ఎక్కించారు. దీంతో దొంగలకు ఆ బాక్స్‌పై కన్నుపడింది. దాన్ని అంత భద్రంగా దాచారంటే తప్పకుండా నగలు, డబ్బులు లేదా విలువైన వస్తువులు ఉండి ఉంటాయని భావించారు. మరో ఆలోచన లేకుండా ఆ బాక్స్‌ను ఎత్తేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆ బాక్స్ తెరిచి చూసిన తర్వాత వాళ్లు ఉన్నారా? పోయారా అనేది కూడా ఇప్పటికీ అనుమానమే. ఇంతకీ ఆ బాక్స్‌లో మనుషుల తలలు ఎందుకు ఉన్నాయి? వాటిని అంత భద్రంగా ఎందుకు దాచారనేగా మీ సందేహం?
అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్ సిటీ పోలీసులకు ఓ ఫిర్యాదు వచ్చింది. మనుషుల తలలు దాచి పెట్టిన బాక్స్ పోయిందని అవతలి వ్యక్తి చెప్పడంతో పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ కాసేపు బ్లాక్ అయ్యింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి, వెంటనే దొంగల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ తలలను లీగల్‌గానే దాచి పెట్టారు. చనిపోయిన తర్వాత తమ శరీరాలను వైద్యం పరిశోధనలకు ఉపయోగించాలని కొందరు అవయవ దానాలు, శరీర దానాలు చేస్తారు. ఆ వ్యక్తుల పార్థీవ శరీరాల నుంచి సేకరించిన తలలు కుళ్లిపోకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బాక్సుల్లో భద్రపరుస్తారు. ఇప్పుడు దొంగలు ఎత్తుకెళ్లింది కూడా అలాంటి బాక్సే.
Also Read: టాయిలెట్‌లో పుతిన్ ఫొటో, మూత్రం పోస్తూ ప్రతీకారం, రష్యాపై ఇదేం రివేంజ్‌రా అయ్యా!
వైద్య విద్య, పరిశోధనల కోసం ‘సైన్స్ కేర్’ ఆ తలలను సేకరించింది. వాటిని ట్రక్కులో తరలిస్తున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. అయితే, దొంగలు కావాలనే వాటిని ఎత్తుకెళ్లారా? లేదా ఏమైనా విలువైన వస్తువులని భావించి దోపిడీ చేశారా అనేది ఇంకా తెలియరాలేదు. బాక్స్ తెరిచిన తర్వాత ఆ దొంగలు తప్పకుండా షాకవుతారని, వాటిని బహిరంగ ప్రదేశాల్లోకి విసిరేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. మనుషుల తలలు ఉన్న బాక్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారని, బయట మీకు అలాంటి బాక్స్ కనిపించినా, తలలు కనిపించినా ఆందోళన చెందవద్దని ప్రకటించారు. ఆ బాక్స్ లేదా తలలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు. పాపం, ఆ దొంగల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏమో!
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!