Rishi Sunak New UK PM : యూకే మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ తదుపరి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో రిషి సునక్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెలన్నర క్రితం ప్రధాని ఎన్నికలలో లిజ్ ట్రస్ అతనిని ఓడించారు. ప్రధానిగా ఎన్నికల లిజ్ ట్రస్ ఆర్థిక సంక్షోభంతో రాజీనామా చేశారు.  ప్రధాని పదవి రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ తప్పుకోవడంతో ఆయన ఎన్నిక లాంఛనం అయింది. సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బెదిరించడంతో  బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో వచ్చిన ట్రస్ కేవలం 44 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు.  బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్‌ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. రిషి సునక్‌కు ఇప్పటికే 144 మంది సభ్యుల మద్దతు లభించింది. ఇప్పటివరకు 59 మంది సభ్యుల మద్దతు పొందిన బోరిస్‌ పోటీ నుంచి వైదొలిగారు. ఇక మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌ ఇప్పటి వరకు కేవలం 23 మంది సభ్యుల మద్దతే కూడగట్టారు.  


రిషి సునక్ ఎవరు? 


రిషి సునక్.. ఇప్పటివరకు ఈయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తించారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. 


పాతికేళ్లకే మిలియనీర్ 


 బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునక్ ఆ దేశ ధనవంతుల్లో ఒకరు.  ఆయన భారత మూలాలున్న వ్యక్తి మాత్రమే కాదు భారత సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు కూడా. అందుకే ఆయన బ్యాక్ గ్రౌండ్ ఆస్తులపై చర్చ జరుగుతోంది. సౌతాంప్టన్‌లో జన్మించిన రిషి సునాక్ పాతికేళ్లకే మిలియనీర్ అయ్యాడు. ఆయన తల్లిదండ్రులు భారత మూలాలున్న వారే అయినప్పటికీ వారు ఈస్ట్ ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. అక్కడే పుట్టిన రిషి సునాక్.. ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలో చేశారు. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత గోల్డ్ మాన్ శాచ్స్ లో కొంత కాలం పని చేశారు . రెండు హెడ్జ్ ఫండ్స్‌లో పార్టనర్‌గా కూడా ఉన్నారు. అక్కడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె పరిచయడం కావడంతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత బ్రిటన్‌లో వ్యాపారాలు ప్రారంభించారు. 


రిషి భార్య ఇన్ఫోసిస్ వారసురాలు అక్షతా మూర్తి 


రిషి సునక్ , ఆయన భార్య అయిన అక్షత మూర్తి సంయుక్త సంపద బ్రిటన్‌ కుబేరుల్లో వారికి చోటు కల్పించింది. బ్రిటన్‌లో ఉన్న ధనవంతుల జాబితాలో వారి నెంబర్ 222గా ఇటీవల ఓ మీడియా సంస్థ లెక్క కట్టింది. అక్షతకు ఒక్క ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉండగా,  ఎలిజిబిత్ సంపద  450 మిలియన్ డాలర్లు (350 మిలియన్  పౌండ్లు)గా ఉందని 2021 సండే టైమ్స్ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది.