Love in War:
ఓవైపు.. తుపాకీ తూటాలు, బాంబుల మోతలు, శతఘ్నుల భీకర దాడులు..
మరోవైపు.. ప్రేమకు దేశాల మధ్య శత్రుత్వం కూడా అడ్డుకాదని నిరూపించిన జంట..
ఓవైపు.. నెత్తురోడుతోన్న ఇరు దేశాల సైన్యం..
మరోవైపు.. రణంలో వెల్లివిరిసిన ప్రణయం..
అక్కడ రోజూ ఇదే కథ..
కానీ ఇది మాత్రం యుద్ధంతో రాసిన ప్రేమ కథ..
రష్యా X ఉక్రెయిన్
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై అక్టోబర్ 24కు సరిగ్గా 8 నెలలు పూర్తయ్యాయి. ఈ 8 నెలల్లో జరిగిన యుద్ధ ప్రభావం.. ఆ రెండు దేశాలపైనే కాదు యావత్ ప్రపంచంపైనే ప్రభావం చూపింది. లక్ష్యం చేరే వరకు యుద్ధం ఆపే ప్రసక్తే లేదని రష్యా అధ్యక్షుడు శపథం చేస్తే.. తమ మట్టిని కాపాడుకునేందుకు తుదిశ్వాస వరకు పోరాడతామని ఉక్రెయిన్ అంటోంది. ఇదీ కొన్నాళ్లుగా రెండు దేశాల పరిస్థితి.
ప్రేమ కథ
అయితే మరోవైపు తమ దేశం కోసం పోరాడుతోన్న ఇద్దరు సైనికుల మధ్య మాత్రం ప్రేమ చిగురించింది. ఎమరాల్డ్ ఎవ్జెనియా అనే ఉక్రేనియన్ స్నైపర్.. యుద్ధం వేళ రష్యాకు చెందిన ఓ సైనికుడిని వివాహం చేసుకుంది. 31 ఏళ్ల రష్యా సైనికుడు ఖార్కివ్‌లోని ఒక అడవిలో అక్టోబర్ 14న ఎవ్జెనియాను పెళ్లి చేసుకున్నాడు.
వారి వివాహం 'డిఫెండర్స్' డే రోజే జరగడం మరో విశేషం. 'డిఫెండర్స్ డే' అనేది ఉక్రేనియన్ సాయుధ దళాల తరఫున పోరాడి వీర స్వర్గం పొందిన సభ్యుల గౌరవార్థం జరుపుకునే రోజు. వారి పెళ్లి రోజే.. తాను చేసుకున్న భర్త పుట్టినరోజు కూడా కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
మిలటరీ కమాండర్ ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు.
వైరల్
తన పెళ్లి ఫొటోలను వధువు ఎవ్జెనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది, దీనిలో ఆమె తెల్లటి వెడ్డింగ్ గౌను ధరించగా ఆమె భర్త సైనిక యూనిఫాం ధరించాడు.
Also Read: Biryani Shop: బిర్యానీ తింటే మగాళ్లకు ఆ సామర్థ్యం తగ్గిపోతుందట!