డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలను డిసెంబరు 1 నుంచి నిర్వహించనున్నారు. డిగ్రీ తృతీయ, ద్వితీయ, ప్రథమ సంవత్సరం బ్యాక్ లాగ్స్ (2016కు ముందు) బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబరు 1నుంచి 6 వరకు డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు, డిసెంబరు 8 నుంచి 13 వరకు డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు, డిసెంబరు 14 నుంచి 17  వరకు డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకొని టీఎస్/ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబరు 20న ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు నవంబరు 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో నవంబరు 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. అదనపు వివరాల కోసం సంబంధిత అధ్యయన కేంద్రాల్లోగానీ, 040-23680241/254 నంబర్లలోగానీ సంప్రదించవచ్చు.


పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


పరీక్షల రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి.. 


పరీక్షల షెడ్యూలు ఇలా..


* డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు డిసెంబరు 1 నుంచి 6 వరకు.


* డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థులకు డిసెంబరు 8 నుంచి 13 వరకు.


* డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి 17  వరకు.


దరఖాస్తు, ఫీజు చెల్లింపు షెడ్యూలు..


* పరీక్ష కోసం రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 20-10-2022.


* పరీక్ష కోసం రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు చివరితేది: 10-11-2022.


* రూ.500 ఆలస్యరుసుముతో పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 15-11-2022.


Official Website


 


:: ALSO READ ::


గురుకుల సైనిక మహిళా కళాశాలలో ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సు, అర్హతలివే!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల అందిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఎకనామిక్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు, సైకో అనలిటికల్‌ టెస్ట్‌లు, మెడికల్‌ టెస్ట్‌లు, షార్ట్‌ లెక్చర్‌, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చివరితేది అక్టోబరు 25.
కోర్సు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 



Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!

తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.మల్లేశ్‌ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..



Cyber Security: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్‌ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబ‌రు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబ‌రులో సంప్రదించవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్‌ కోర్స్ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్పర్మేషన్‌ సైన్స్‌ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. 
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..