మామ్ చాలా మారిపోయింది ఇంతకముందు ఎవరైనా ఒక మాట అంతే ఫీల్ అయ్యేది ఇప్పుడు మాటకి మాట ఎదురు చెప్తుంది అని అభి మనసులో అనుకుంటాడు. అటు సామ్రాట్ రాకుండా ఉంటే బాగుండు అని అనసూయ అనుకుంటుంది. అప్పుడే సామ్రాట్ వస్తాడు. ఆ కారు సౌండ్ విని తులసితో పాటు ఇంట్లో వాళ్ళు కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేస్తారు. వెళ్ళండి మేడమ్ మీ క్లోజ్ ఫ్రెండ్ ఆరాటంగా ఎదురు చూస్తున్నాడని లాస్య, నందు వెటకారం ఆడతారు. ఈరోజు ఊరు దాటి తిరుగుతున్నారు రేపు దేశం దాటి తిరుగుతారు అని నందు అంటే మీకు అడిగే హక్కు లేదని తులసి గట్టిగానే చెప్తుంది. ఇన్ని మాటలు పడుతూ వెళ్ళడం అవసరమా తులసి ఆగిపోవచ్చు కదా అని అనసూయ అడుగుతుంది. మాటలు అన్నారని ఆగిపోతే వాటిని నిజం చేసినట్టు అవుతుందని తులసి అంటుంది.


Also read: దేవి వెళ్లిపోవడానికి కారణం నువ్వేనని రుక్మిణిని నిందించిన ఆదిత్య- బకరాలైన సూరి, భాష


ఇక తులసి సామ్రాట్ దగ్గరకి వస్తుంది. సిగ్గు లేకుండా ఎంత భరితెగించిపోయాడో డ్రైవర్ లా కారు డోర్ తీసి పట్టుకుంటున్నాడని అనసూయ తిట్టుకుంటుంది. ఇద్దరు కలిసి కారులో వరంగల్ కి బయల్దేరతారు. మీ వాళ్ళతో కలిసి జీవించడం విసుగుపుట్టదా అని అడుగుతాడు. ఏదో ఒక విషయం రైజ్ చేసి గొడవలు పడుతూనే ఉంటారు ఎప్పుడు పారిపోవాలని అనిపించలేదా అని సామ్రాట్ అడుగుతాడు. దానికి తులసి ప్రేమ పాశం, గుండె కోసుకోవడం, మరణం అంటూ వేదాంతం మొదలుపెడుతుంది. ప్రేమ ఉన్నచోటే అసూయ, ద్వేషం ఉంటాయ్ అని చెప్తుంది. అనసూయ చిరాకుగా కూర్చుంటే లాస్య వచ్చి మంట పెడుతుంది.


ఒకప్పుడు నా మీద అరిచే వాళ్ళు ఏమైపోయింది ఆ రోషం, బరితెగించి ఎదురు తిరుగుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారని లాస్య అడుగుతుంది. తులసి మిమ్మల్ని చూడదని భయపడుతున్నారా అని అంటుంది. తులసి మిమ్మల్ని లెక్క చేయకుండా ఎదురు మాట్లాడింది అని నిలదీశాను అంతే కానీ నాకు తన మీద ఏ కోపం లేదు, మీరు ఎదురుతిరగాలి అని నూరిపోస్తుంది. ఇన్నాళ్ళూ నా ప్రేమ చూశారు ఇప్పుడు నా కోపం చూస్తారని అనసూయ అంటుంది. తులసి, సామ్రాట్ పని మీద వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతారు. దారి మధ్యలో గుడి కనిపిస్తే అక్కడకి వెళ్దామని తులసి అడుగుతుంది. ఇద్దరు కలిసి గుడిలోకి వెళ్ళి దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు.


Also Read: యష్, వేద మధ్య అగాథం- పాత మొగుడి మీద మోజుతో అభిమన్యుకి హ్యాండ్ ఇస్తున్న మాళవిక


దివ్య నందు దగ్గరకి వచ్చి చెస్ ఆడదామని అడుగుతుంది. ఎదురుగా అనసూయ ఉండి చిటపటలాడుతూ ఉంటుంది. అంకిత వచ్చి భోజనానికి పిలుస్తుంది.సందు దొరికిన ప్రతిసారి లాస్య తులసి గురించి నెగటివ్ గా చెప్తూనే ఉంటుంది. అటు తులసి, సామ్రాట్ గుడిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. తులసి పాట అందుకుంటుంది. సామ్రాట్ ని చూసి అక్కడ ఇద్దరు అమ్మాయిలు లైన్ వేస్తూ ఉంటారు. అది చూసి తులసి నవ్వుతుంది.


తరువాయి భాగంలో..


వర్షంలో చిక్కుకుపోయిన తులసి, సామ్రాట్ ఒక హోటల్ కి చేరుకుని ఇంటికి ఫోన్ చేస్తారు. తులసి మాట్లాడేది పరంధామయ్యకి వినిపించదు. అనసూయ తులసి గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని నందుతో తన టెన్షన్ గురించి చెప్తుంది. అప్పుడే నందు తులసి ఫోన్ చేసిణ నెంబర్ కి తిరిగి చేస్తాడు. వేరే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి అంకుల్, ఆంటీ బెడ్ రూంలో రెస్ట్ తీసుకుంటున్నారని చెప్తాడు.