Devatha October 24th Update: దేవి వెళ్లిపోవడానికి కారణం నువ్వేనని రుక్మిణిని నిందించిన ఆదిత్య- బకరాలైన సూరి, భాష

దేవి కనిపించకపోవడంతో తన కోసం వెతుకుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.

Continues below advertisement

ఎవరో బిడ్డ కనిపించకపోతే ఆదిత్య వెళ్ళి వెతకాల్సిన అవసరం ఏంటి అని సత్య దేవుడమ్మతో అంటుంది. ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి అది మన ఇంట్లో దానిలా కలిసిపోయింది అవ్వ, తాత అని మనతో ప్రేమగా ఉంటుంది. అలాంటి పిల్ల కనిపించకపోతే బాధపడొద్దు అంటావ్ ఏంటి అని దేవుడమ్మ అడుగుతుంది. బాధపడొద్దు అని నేను అనడం లేదు కానీ ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా బాధపడాల్సిన అవసరం లేదని అంటుంది. అది వాడి అభిమానం.. దేవి దొరికిన తర్వాతే వాడు వస్తాడులే అని దేవుడమ్మ సర్ది చెప్తుంది.

Continues below advertisement

అటు ఆదిత్య, రుక్మిణి ఒకే గదిలో ఉంటారు. దేవితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని రుక్మిణి ఎమోషనల్ అవుతుంది. దేవమ్మ ఎలా ఉందో ఏంటో బిడ్డ తిన్నదో లేదో అని ఏడుస్తుంటే అది ముందే ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆదిత్య కోపంగా అరుస్తాడు. ఆ మాధవ్ గాడు నాన్న కాదని తెలిసినప్పుడే నేనే తండ్రి అని చెప్పినట్లయితే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా అని అంటాడు. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి వల్ల చెప్పలేకపోయాను అని రుక్మిణి బాధపడుతుంది. అదే నువ్వు చేసిన తప్పు.. నువ్వు ఎంత అడిగినా చెప్పడం లేదని దేవి మనసు ఎంత అల్లాడిపోయి ఉంటుంది. కావాలని చేసిన చేయకపోయినా దేవి బాధపడుతుంది నీ వల్లే అని కోపంగా అంటాడు.

Also Read: యష్, వేద మధ్య అగాథం- పాత మొగుడి మీద మోజుతో అభిమన్యుకి హ్యాండ్ ఇస్తున్న మాళవిక

సూరి, భాషా ఒక హోటల్ కి వెళతారు. అక్కడ న్యూస్ పేపర్లో ఒకడి ఫోటో వేసి కనబడుట లేదు ఆచూకీ చెప్పిన వారికి రూ.50 లక్షలు బహుమతిగా ఇస్తాం అని ప్రకటనలో రాసి ఉంటుంది. అది చూసిన భాషా, సూరికి ఆ ఫోటోలో ఉన్న వాడు కనిపిస్తాడు. వాడికి మాయ మాటలు చెప్పి ఎలాగైనా వాడిని వాళ్ళకి అప్పగించి డబ్బులు తీసుకోవాలని అనుకుంటారు. నీ పేరు ఏంటి అని అడిగితే కరెన్సీ అని చెప్తాడు. డబ్బులు వస్తున్నాయని సూరి వాళ్ళు తెగ సంతోషపడతారు. వెంటనే ప్రకటనలో ఉన్న నెంబర్ కి ఫోన్ చేస్తే ఆ బండోడు లిఫ్ట్ చేసి దొరికారు బకరాలు  అని వాళ్ళని ఆడుకుంటాడు. దేవి కోసం ఆలోచిస్తూ ఉంటే ఎవరో పాప ఇంటి ముందు నుంచి వెళ్తుంటే తనే దేవి అనుకుని రుక్మిణి వెనుకాలే పరుగులు పెడుతుంది.

దగ్గరకి వెళ్ళి చూసేసరికి దేవి కాదని తెలిసి బాధపడతారు. మన దేవమ్మ కూడా ఇలాగే రోజు స్కూల్ కి రెడీ అయ్యి వెళ్ళేది.. ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్లిందో అని రుక్మిణి ఏడుస్తుంది. బాధపడకు రుక్మిణి బిడ్డ దొరుకుటుందిలే మనం ఎవరికి అన్యాయం చెయ్యలేదు ఆ దేవుడు మనకి అన్యాయం చేయడులే అని ఆదిత్య నచ్చజెప్పడానికి చూస్తాడు. దేవి క్షేమంగా తిరిగి వస్తుంది నువ్వేమి భయపడకు, అసలు ఆ పసి మనసుకు ఏమైంది ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావడం లేదని ఆదిత్య అంటాడు.

Also Read: వరంగల్ వెళ్ళి వర్షంలో ఇరుక్కుపోయిన సామ్రాట్, తులసి- నందుకి సపోర్ట్ గా నిలిచిన అనసూయ

Continues below advertisement
Sponsored Links by Taboola