సామ్రాట్ కి నీకు స్నేహం ఉంటే అది నీ వరకే చూసుకో మా ఫ్యామిలీ విషయాల్లో అతన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావ్. అతన్ని బయటకి వెళ్లమను మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని నందు చెప్తాడు. సామ్రాట్ వెళ్లబోతుంటే తులసి ఆపుతుంది. మీరు ఎవరి కోసం వచ్చారు, నేను వెళ్ళమని చెప్పానా, అలా వెళ్ళడం నన్ను అవమానించినట్టే, ఈ ఇల్లు నాది ఇక్కడ నా మాట చెల్లుతుంది ఆయనది కాదు. మీతో ఇబ్బందిగా అనిపిస్తే వెళ్లాల్సింది మీరు కాదు ఆయన అని తులసి చెప్తుంది.


నందు: ఇల్లు నీదే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉంది మా అమ్మానాన్న, నా పిల్లలు


తులసి: వాళ్ళు నాకు కూడా పిల్లలే


నందు: చూస్తున్నారుగా ఇల్లు తనకి ఇచ్చి ఎంత పెద్ద తప్పు చేశారో


లాస్య: మావయ్య గారు ఏం మాట్లాడతారు.. తులసి చెప్తే ముందు వెనుక చూడకుండా మెడ పట్టుకుని గెంటేస్తారు. ఆఫీసులో సామ్రాట్ ని అడ్డం పెట్టుకుంది, ఇంట్లో మావయ్య గారు ఉన్నారు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు పద వెళ్దాం


అనసూయ: ఆగరా నందు నిన్ను సపోర్ట్ చెయ్యడానికి ఈ అమ్మ ఉంది. నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువి. ఆస్తి ఇస్తారో తెలియదు కానీ గౌరవం ఇచ్చి తీరాలి. ఎవరి ఫ్రెండ్ వస్తూ పోతూ ఉంటే నిన్ను ఎవరు ఆపేది. నిన్ను రానివ్వకపోతే నేను ఈ ఇంట్లో ఉండను


తులసి: మీ కొడుకుని రావొద్దు అని నేను ఎప్పుడు చెప్పలేదు కానీ నా విషయంలో మాత్రం అసలు జోక్యం చేసుకోకూడదు. నా ఫ్రెండ్ సామ్రాట్ గారు ఈరోజే కాదు రేపు కూడా వస్తారు మేమిద్దరం ఒకే కారులో కూర్చుని వరంగల్ వెళ్తున్నాం. పబ్లిక్ గా కాదు అందరి ముందే వెళ్తాం. మీ కొడుకు మళ్ళీ ఇదే డ్రామా మొదలుపెడతాడు ఏమో చెప్పడానికి ఆయనకి విసుగ్గా లేదేమో కానీ వినడానికి నాకు తలనొప్పిగా ఉంది. సామ్రాట్ గారు మా వాళ్ళ మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి, వాళ్ళు అంతే మారారు. మీరు చెప్పిన టైమ్ కి రెడీగా ఉంటాను అని చెప్తుంది.


Also Read: పాపం తులసి పప్పులు ఉడకలేదు- నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా భయపడేదేలే అని విజృంభించిన లాస్య


అనసూయ తులసి చేసిన పనికి బాధపడుతూ ఉంటుంది. బిడ్డలాంటి తులసి బాగుకోశం నేను ఆరాటపడటం తప్పా. నేను అడిగింది ఒక్కటే ఆ సామ్రాట్ కి దూరంగా ఉండమన్నా నా కోసం ఆ ఒక్క పని చేయలేదా అని అనసూయ పరంధామయ్యతో బాధ పంచుకుంటుంది. కనీసం మీరైనా తులసికి నచ్చజెపుతారని చూస్తుంటే తనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారని అంటుంది. తులసి నువ్వు చేసింది మర్చిపోయి మామూలుగా ఉంటుంది తన స్వేచ్చకీ అడ్డుపడకు అని పరంధామయ్య చెప్తాడు.


నందుని ఇంటికి వెళ్దామని లాస్య అడుగుతుంది. మీ అమ్మ నీకు సపోర్ట్ గా నిలబడింది అది బాగా నచ్చింది నాకు, అత్తయ్యగారు మన వైపు ఉన్నారు ఈ టైమ్ ని మనం యూజ్ చేసుకుందాం. అత్తయ్యగారి పుణ్యం వల్ల మళ్ళీ దగ్గర అయ్యే అవకాశం వచ్చింది. నీ  మీద నమ్మకం కలిగి ఇంటికి వచ్చి ఉండు అనేలా చేద్దాం అని లాస్య ఎక్కిస్తుంది. ఆ సామ్రాట్ కూడా అక్కడికి వస్తాడు తులసి వాడి కారు ఎక్కి నా మొహం వైపు గర్వంగా చూస్తుందని నాకు అది నచ్చదని అంటాడు కానీ లాస్య మాత్రం వెళ్దామని చెప్తుంది. అత్తయ్యగారు ఒంటరిగా దొరుకుతుంది ఆమెకి బ్రెయిన్ వాష్ చేసి మన వైపు తిప్పుకోవాలి అని మనసులో అనుకుంటుంది.


Also Read: దేవిని తీసుకెళ్లిపోతానని తెగేసి చెప్పిన ఆదిత్య- గుండెలు పగిలేలా ఏడుస్తున్న రుక్మిణి


తులసి వరంగల్ వెళ్లేందుకు రెడీ అయ్యి అనసూయ దగ్గరకి వస్తుంది. అందరూ కావాలని అనసూయని ఉడికించేలా మాట్లాడతారు. అప్పుడే నందు, లాస్య వస్తారు. అందరం కలిసి బయటకి వెళ్దామని వచ్చామని లాస్య అంటే ప్రేమ్ మాత్రం అంత లేదు సామ్రాట్ గారు వచ్చే టైమ్ అయ్యిందని తమాషా చెయ్యడానికి వచ్చారు అని కౌంటర్ ఇస్తాడు.


తరువాయి భాగంలో.. 


వరంగల్ వెళ్ళిన సామ్రాట్, తులసి వర్షంలో చిక్కుకునిపోతారు. ఇంట్లో వాళ్ళు అందరూ వాళ్ళ కోసం టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటారు.